
భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) 2020-2021 సంవత్సరానికిగాను అధ్యక్షుడిగా కోటక మహీంద్రా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో అయిన ఉదయ్ కోటక నియమితులయ్యారు. ప్రెసిడెంట్ డెసిగ్నేట్గా టాటా స్టీల్ లిమిటెడ్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ టీవీ నరేంద్రన్, వైస్‌ప్రెసిడెంట్‌గా బజాజ్ ఫిన్సర్వ్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ బజాజ్ కొనసాగనున్నారు. ఇప్పటివరకు సీఐఐ అధ్యక్షుడిగా విక్రం కిర్లోస్కర్ సేవలందించారు. కాగా, ప్రెసిడెంట్ డెసిగ్నేట్గా ఉదయ్ కోటక గత రెండేండ్లుగా ఉన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు చెందిన మైనింగ్, మెటల్స్ కౌన్సిల్ కో-చైర్మన్‌గా టీవీ నరేంద్రన్ పనిచేశారు. అలాగే బ్రిక్స బిజినెస్ కౌన్సిల్లో భారత ప్రతినిధిగా, ఇండోఫ్రెంచ్ సీఈవో కౌన్సిల్ సభ్యుడిగా కూడా ఉన్నారు.