
వాషింగ్టన్లో ఆందోళనకారుల చేతుల్లో పాక్షికంగా దహనమైన సెయింట్ జాన్స్ చర్చ్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సందర్శించారు. చేతిలో బైబిల్ పట్టుకున్న ట్రంప్ చర్చిలో కొంత సేపు గడిపారు. అధ్యక్షుల చర్చిగా పేర్కొనే సెయింట్ జాన్స్ ఎపిస్కాపల్ చర్చ్‌లో తొలి ప్రార్థనలు 1816 అక్టోబరు 27న జరిగినట్లు రికార్డులు చెబుతున్నాయి. వైట్‌హౌస్‌కు దగ్గరగా ఉంటుంది ఈ చర్చి. జేమ్స్ మాడిసన్ మొదలుకొని అధ్యక్షులంతా ఈ చర్చిలో ప్రార్థనలు చేసిన వారే.