పోరి కిక్కా...బాటిల్ కిక్కా 'లాస్ట్ పెగ్' కిక్కా....

భారత్ సాగర్, యశస్విని రవీంద్ర హీరో హీరోయిన్లుగా వినూత్న కాన్సెప్టుతో వస్తోన్న లాస్ట్ పెగ్ . ఇటీవల విడుదల చేసిన ఈ చిత్ర టైటిల్ పోస్టర్ కు అలాగే యాక్షన్ టీజర్ కు మంచి స్పందన లభించింది. లేటెస్ట్ గా లాస్ట్ పెగ్ చిత్రం నుండి మొదటి లిరికల్ వీడియో పోరి కిక్కా..  బాటిల్ కిక్కా  విడుదల చేశారు చిత్ర యూనిట్. ఈ సాంగ్ ను పాపులర్ సింగర్ హేమచంద్ర పాడడం జరిగింది, అలాగే ఎన్నో సూపర్ హిట్ పాటలు రాసిన
భాష్యశ్రీ ..ఈ పాటను రచించారు. భాష్యశ్రీ విజయ్ అంథోని నటించిన సినిమాలకు సూపర్ హిట్ సాంగ్స్ కు సాహిత్యం అందించారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ సంజయ్ మాట్లాడుతూ... ఇటీవల యాక్షన్ టీజర్ ను విడుదల చేశాము, తాజాగా పోరి కిక్కా  బాటిల్ కిక్కా   లిరికల్ వీడియో విడుదల చేశాము త్వరలో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని ఇంట్రెస్టింగ్ డిటైల్స్ ను విడుదల చేయబోతున్నాము, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళ భాషల్లో విడుదల కానుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలు ఈ సినిమాలో ఉండబోతున్నాయి, ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు హైలెట్ గా నిలుస్తాయని తెలిపారు. నటీనటులు: భారత్ సాగర్, యశస్విని రవీంద్ర,  సంగీతం: లోకేష్,  మ్యూజిక్ ప్రొడ్యూసర్: సంజీవ్,.టి డిఓపి: కార్తిక్ కుమార్ కొణిదెల, ఎడిటర్: రుత్విక్ పిఆర్ఓ: సాయి సతీష్,  నిర్మాత: రజత్ దుగోజి సలేంకి., రచన, దర్శకత్వం: సంజయ్ వడత్. ఎస్


                    Advertise with us !!!