
ఉరిమే ఉత్సాహం అనే మాటకి ప్రతీక...ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని. ఆయన జోరు చూస్తే...ప్రేక్షకుడిలోనూ అంతే జోష్ వచ్చేస్తుంది. నచ్చింది చేయడానికి ఇష్టపడే రామ్, తనకి నచ్చిన సినిమా రంగంలోనే కెరీర్‌ని స్టార్ట్ చేశాడు. గత ఏడాది ‘ఇస్మార్ట్ శంకర్’తో బ్లాక్‌బస్టర్ హిట్‌ని తెలుగు లోనే కాకుండా హిందీ లో కూడా హైయెస్ట్ వ్యూయర్ షిప్ సొంతం సొంతం చేసుకుని త్వరలో ‘రెడ్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సోదరుడు క్రిష్ణ పోతినేని సమర్పణలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై కిషోర్ తిరుమల దర్శకత్వంలో స్రవంతి రవి కిషోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నివేథా పేతురాజ్, మాళవిక శర్మ, అమృతా అయ్యర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మెలొడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. రీసెంట్గాఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని పుట్టినరోజు సందర్భంగా విడుద చేసిన ‘దించక్ దించక్' సాంగ్ భారీ రెస్పాన్స్ తెచ్చుకొని సోషల్ మీడియాలో 1. 5 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఈ సందర్భంగా ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తో రెడ్ సినిమా, లక్డౌన్ విశేషాల గురించి తెలుగు టైమ్స్ జరిపిన ఇంటర్వ్యూ.....
లాక్డౌన్ తర్వాత జీవితం ఎలా ఉంది?
నాకు మాత్రం కొత్తగా ఏమీ అనిపించడం లేదు. నాకు ఇంట్లో గడపడమే ఇష్టం. ఉదయాన్నే లేవటం, నా పనులు చేసుకోవడం, వంట చేసుకోవడం, ప్రపంచం నలుమూలలా ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఇంటర్నెట్ చూడటం టీవీ వార్తల్లో తెలుసుకోవడం ..అంతే. ఇప్పుడు ఇంతకంటే ఎక్కువగా చేసేదేం లేదు కదా. అయితే ఈ సమయంలో చాలా మంది శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. ఎవ్వరం ఊహించని విచిత్ర పరిస్థితి ఇది. ఈ లాక్ డౌన్ ప్రభావం సినీ పరిశ్రమ పైన కూడా ఆర్ధికపరం గా నష్టపోతుంది. యదా స్థితికి రావడానికి సమయం పడుతుంది.
లాక్డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్నవాళ్లకి మీరిచ్చే సలహా ఏమిటి ?
సలహాలు ఇచ్చే అంత గొప్పవాడిని కాదు కానీ మనిషికి శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో, మానసిక ఆరోగ్యమూ అంతే ముఖ్యం. కరోనా కారణంగా ఎవరి స్థాయిలో వాళ్లు ఇబ్బందు పడుతున్నాం. అలాగని నెగిటివిటీనే చూడకూడదు. ఇందులో పాజిటివిటీని కూడా వెతకాలి. ఇన్నాళ్లూ పరుగు పెట్టాం కాబట్టి, ఇప్పుడు దొరికిన ప్రశాంతతని ఆస్వాదించాలి. లక్డౌన్ కి ముందు మన దైవందిన జీవితంలో వుండే ఉరకలు పరుగులు ఇప్పుడు లేవు కనుక మానసికంగా సరికొత్త ఆలోచనల్ని క్రియేట్ అవడానికి ఆస్కారం వుంది.
మీ పుట్టిన రోజు మే 15 అనుకుంటా ఈ లాక్ డౌన్ లో ఎలా జరుపుకున్నారు?
పుట్టినరోజు అంటే చిన్నప్పుడు ఆసక్తిగా ఉండేది. కొంచెం పెద్దయ్యాక ‘మనం పుట్టినందుకు మనం ఆనందపడకూడదు. మన చుట్టుపక్కవాళ్లు ఆనందపడాలి’ అని ఎక్కడో చదివా. అప్పట్నుంచి ఈ పుట్టిన రోజు సంబరాలు చేసుకోవడం మానేశా. హీరో అయ్యాక, అభిమానుల సందడి చూసి చిన్న ఆనందం కలిగింది. అప్పట్నుంచి వాళ్ల మధ్య పుట్టినరోజు వేడుకు చేసుకునే వాడిని ఈ సారి వారికీ ముందుగానే లెటర్ ద్వారా తెలియచేసా .. నేను నా కుటుంబ సభ్యులతో సదా సీదాగా పుట్టిన రోజుని జరుపుకోవడం కొత్తగా అనిపించింది.
లుక్ పరంగానూ మీలో మార్పు కనిపిస్తోంది?
ప్రతి సినిమాలోనూ హీరో మంచివాడిగా కనిపిస్తుంటాడు. దాంతో మంచితనానికె చిరాకు వచ్చేసింది. ఒక నటుడిగా కంటే సినిమా చూసే ప్రేక్షకుడిగా నాలో ఒక రకమైన ఆవేశం వచ్చింది. ఆ ఆవేశంతోనే పూరి జగన్నాథ్ దగ్గరికి వెళ్లా. ‘ఇప్పటిదాకా మనం చేయందేదో చేయాలి ’ అని చెప్పా. ‘ ఈ కథలో నువ్వు లవర్ బాయ్ కాదు, నువ్వు ఇదీ. నిన్ను ఎవ్వరూ అలా వాడలేదు, నేను వాడతా’ (నవ్వుతూ) అంటూ ఆయన ‘ఇస్మార్ట్ శంకర్’ చేశారు.
పూరితో ప్రయాణంలో మీరు ఏం నేర్చుకున్నారు?
ఆయనొక అద్భుతమైన దర్శకుడు. వ్యక్తిగా ఇంకా నచ్చుతారు. ఆయనలా బతకడం నేర్చుకుంటే చాలు. చిన్న చిన్న విషయాలల్లోనూ సంతోషాన్ని వెతుక్కుంటారు. ఫ్రేస్టేషన్ అనేది ఉండదు. పూరి నితిన్ ల హార్ట్ ఎటాక్ చిత్రంలో 'ఈ చిన్ని లైఫ్ లో.. ఈ చిట్టి లైఫ్ లో... బుజ్జి లైఫ్ లో... పొట్టి లైఫ్ లో ఎదైనా కొంచం ఉంటే చాలు హేయ్ సరదాగా బ్రతికేస్తే అది చాలు... థాట్స్ అల్ రైట్ మామా' పాటల నిజ జీవితంలో ప్రవహిస్తుంటాడు పూరి.
కిషోర్ తిరుమతో ఇది మీకు మూడో చిత్రం కదా?
దర్శకుడు కిషోర్ మా కుటుంబంలో ఒక భాగం. మా నిర్మాణ సంస్థలో మూడు సినిమాలు చేశారు, రెండు సినిమాలకి రచయితగా పనిచేశారు. ‘నేను శైలజ’లో తను నన్ను కొత్తగా చూపించారు. ‘రెడ్’ రీమేక్ అయినా తన ఆలోచనతో కొత్తగా తీర్చిదిద్దారు.
మీ సినీప్రయాణాన్ని గుర్తుచేసుకుంటే ఏమనిపిస్తుంది?
`నేను ఏం చేయాలనిపిస్తే అదే చేస్తుంటా. నేను బాగా ఆస్వాదించే కథల్ని ఎంపిక చేసుకునేవాణ్ని. నెమ్మదిగా అభిమాన గణం పెరిగింది కాబట్టి ఇప్పుడు నాతోపాటు వాళ్ల ఇష్టాలు గురించి కూడా ఆలోచిస్తుంటా. ‘దేవదాస్’, ‘జగడం’ నుంచీ మాస్, క్లాస్ మేళవింపుగా సినిమాలు చేస్తున్నాను . ఒక్కో దర్శకుడు ఒక్కో కోణంలో నన్ను ఆవిష్కరించడం నాకు బాగా సంతృప్తినిచ్చే విషయం.
పాన్ ఇండియా చిత్రాలు చేసే ఆలోచన ఉందా?
హిందీలో డబ్ అయిన నా సినిమాకు వరుసగా వంద మిలియన్ల వ్యూస్ వచ్చాయి. తమిళం నుంచి కూడా ఎప్పట్నుంచో అవకాశాు వస్తున్నాయి. కానీ తెలుగు తో పాటు కథా పరంగా ఇతర భాషల్లోనూ పక్కాగా ఉంటుందనిపిస్తేనే పాన్ ఇండియా తరహా సినిమాు చేస్తాను.
ఇంతకీ మీ పెళ్లి ఎప్పుడు?
ప్రస్తుతానికి ఇలా ఉంటేనే బాగుంటుంది అనిపిస్తోంది (నవ్వుతూ). ప్రేమ, పెళ్లి మన చేతుల్లో ఉండవు. కాబట్టి అవన్నీ జరగాల్సిన సమయం వస్తే జరిగిపోతాయి అంటూ ఇంటర్వ్యూ ముగించారు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని.