
యాపిల్ సహా సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీ సంస్థలు, కాంట్రాక్టు తయారీ కంపెనీలు తమ ప్లాంట్లను భారత్కు బదిలీ చేసుకోవడానికి మార్గం సుగమం కానుంది. ఇందుకోసం ఎలక్ట్రానిక్స్ తయారీకి సంబంధించిన ప్లాంటు యంత్రసామగ్రి మదింపు నిబంధనను తొలగించనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇటీవల నోటిఫై చేసిన రూ.48,000 కోట్ల విలువైన ప్రోత్సాహక పథకాల్లో భాగంగా ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకోవచ్చు. కొవిడ్ నేపథ్యంలో చైనా నుంచి తమ కంపెనీలను బదిలీ చేయాలనుకుంటున్న అమెరికా, జపాన్, తైవాన్, ఇతర దేశాల కంపెనీలకు.. భారత్ ఆకర్షణీయంగా కనిపించాలని ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ భావిస్తోంది.