
అమెరికాలోని వైట్‌హౌస్ వద్ద జరిగిన ఆందోళనల్లో ఆందోళనకారులు భవనం కిటికీలను బద్దలు కొట్టడంతోపాటు పలు వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ సమయంలోనే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అతడి భార్య మెలానియా, కుమారుడు బారన్లను కొద్ది సమయం పాటు రహస్య బంకర్లో ఉంచినట్లు తెలిసింది. వైట్‌హౌస్ వద్ద ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువుతోపాటు స్టన్ గ్రెనైడ్లు వాడారని వార్తలు వచ్చాయి. పలువురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు ఆదివారం మొత్తం బహిరంగ ప్రకటనలు చేయకపోగా, ఎవరికీ కనిపించలేదు. దేశంలో అశాంతికి మీడియా సంస్థలే కారణమని ట్రంప్ ట్వీట్లు చేశారు.