'గుండ‌మ్మ క‌థ' ట్రయిలర్ విడుదల

ఆదిత్య క్రియెష‌న్స్‌ ప‌తాకం పై ల‌క్ష్మీ శ్రీవాత్స‌వ స్వీయ నిర్మాణంలో కృష్ణం రాజు ద‌ర్శ‌కునిగా తెర‌కెక్కిన సినిమా గుండ‌మ్మ క‌థ‌. ఈ చిత్రంతో ఆదిత్య హీరోగా, ప్ర‌ణ‌వ్య లు హీరోయిన్ గా చేస్తున్నారు. అన్ని వర్గాలు ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకునే రీతిన హోల్స‌మ్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందిన ఈ చిత్రానికి నిర్మాతగా ల‌క్ష్మీ శ్రీవాత్స‌వ ఓ వైపున‌ నిర్మాణ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తూనే మ‌రోవైపున స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించ‌డం విశేషం. అంతేకాకుండా కృష్ణం రాజు తో క‌లిసి ద‌ర్శ‌క‌త్వ భాద్య‌త‌లు కూడా నిర్వ‌హించారు. అల‌‌నాటి గుండ‌మ్మ క‌థ ఏ రేంజ్ లో ప్రేక్ష‌కుల్ని ఎంట‌ర్ టైన్ చేసిందో అంతే స్థాయిలో ఈత‌రం ఆడియెన్స్ కి క‌నెక్ట్ అయ్యే రీతిన ల‌వ్, కామెడీ, సెంటిమెంట్ త‌దిత‌ర అంశాల‌తో కూడా స‌న్నివేశాలు తెర‌కెక్కించ‌న‌ట్లుగా చిత్ర బృందం తెలిపింది. గ‌తంలో విడ‌దుల చేసిన ఈ సినిమా టైటిల్ లుక్ పోస్ట‌ర్ కి సోష‌ల్ మీడియాలో ఆద‌ర‌ణ ల‌భించ‌డంతో అదే ఉత్స‌హాంతో తాజాగా గుండ‌మ్మ క‌థ ట్రైల‌ర్ ని విడుద‌ల చేశారు. అలానే క‌‌రోనా నేప‌థ్యంలో థియేట‌ర్స్ లాక్ డౌన్ ముగిసిన వెంట‌నే ఈ చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా నిర్మాత‌, ద‌ర్శ‌కులు లక్ష్మీ శ్రీవాత్స‌వ, కృష్ణంరాజులు  మాట్లాడుతూ
అలనాటి గుండ‌మ్మ క‌థ త‌ర‌త‌రాలు తెలుగు సినీ ప్రేక్ష‌కుల్ని ఏ రీతిన అల‌రిస్తుందో అదే స్పూర్తితో అన్ని వ‌ర్గాల తెలుగు ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకునే విధంగా ఈ మోడ్ర‌న్ గుండ‌మ్మ క‌థ‌ని రెడీ చేశాము. ఈ సినిమాతో ఆదిత్య హీరోగా, ప్ర‌ణ‌వ్య హీరోయిన్ గా చేస్తున్నారు. ఈ సినిమాలో జ‌బ‌ర్థ‌స్థ్ ఫేమ్ గెటెప్ శ్రీను కామెడీ ప్రేక్ష‌కుల్ని క‌డుపుబ్బా న‌వ్విస్తోంద‌ని, ఫ్యామిలీతో హాయిగా చూసే సినిమాగా గుండ‌మ్మ క‌థ ఉండ‌బోతుంది అని అన్నారు. క‌రోనా కార‌ణంగా ఏర్ప‌డిన థియేట‌ర్స్ లాక్ డౌన్ ముగిసిన వెంట‌నే ఈ చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు ప్లాన్ చేస్తున్న‌ట్లుగా ల‌క్ష్మీ శ్రీవాత్స‌వ తెలిపారు.

న‌టీ న‌టులు - ఆదిత్య‌, ప్ర‌ణ‌వ్య‌, గెటెప్ శ్రీను, భాష త‌దిత‌రులు టెక్నీషియ‌న్లు కెమెరా - మోనీష్ భూప‌తి ఎడిట‌ర్ - ప్ర‌వీణ్ పూడి మ్యూజిక్ - స‌తీష్ సాధ‌న్‌
క‌థ‌, డైలాగ్స్, స్క్రీన్ ప్లే - ల‌క్ష్మీ శ్రీవాత్స‌వ‌ నిర్మాత - ల‌క్ష్మీ శ్రీవాత్స‌వ‌ ద‌ర్శ‌క‌త్వం - ల‌క్ష్మీ శ్రీవాత్స‌వ‌, కృష్ణం రాజు