
ప్రజల జీవితాల్లో వినోదం అనేది ఒక భాగమైపోయింది. ఒకానొక టైమ్‌లో ప్రజలకు వినోదాన్నిచ్చివి నాటకాలే. ఆ తర్వాత నాటకాల్ని పక్కన పెట్టి సినిమాలు రాజ్యమేలడం మొదలుపెట్టాయి. సినిమాలు ఎప్పుడైతే ఎక్కువ ప్రాచుర్యాన్ని పొందాయో అప్పటి నుంచి టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరూ సినిమాల్లో రాణించాలని, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని ఉబలాటపడేవారు. కానీ, అది అనుకున్నంత తేలిక కాదని మద్రాసు వెళ్లిన ప్రతి ఒక్కరికీ అర్థమైంది. సినిమాల్లో బ్రేక్ రావాలంటే టాలెంట్ ఒక్కటే సరిపోదు, అదృష్టం కూడా కావాలని తెలిసింది. అలా టాలెంట్‌తోపాటు అదృష్టం కూడా ఉన్న వాళ్లు వృద్ధిలోకి వచ్చారు, తిరుగులేని విజయాలు సాధించారు. అలాంటి వారిలో సూపర్‌స్టార్ కృష్ణ ఒకరు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. తన అసమానమైన ప్రతిభా పాటవాలతో 55 సంవత్సరాల్లో 365 సినిమాల్లో నటించారు. నిర్మాతగా, దర్శకుడిగా, స్టూడియో అధినేతగా ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించారు. ఈరోజు (మే 31) సూపర్‌స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆయన సినీ జీవితంలోని కొన్నివిశేషాలు మీకోసం...
తొలి రోజుల్లో కృష్ణ కొన్ని నాటకాలు వేయడమే కాకుండా పదండి ముందుకు, కులగోత్రాలు చిత్రాల్లో చిన్న పాత్రలు పోషించారు. ఆ తర్వాత ఆదుర్తి సుబ్బారావు `తేనె మనసులు` చిత్రంతో కృష్ణను హీరోగా పరిచయం చేశారు. తొలి చిత్రంతోనే కృష్ణ భారీ విజయాన్ని సొంతం చేసుకుని అందరి దృష్టిలో పడ్డారు. ఆ సినిమా తర్వాత అవకాశాలు రావడం మొదలైంది. అయితే ఒకే తరహా పాత్రలు చేసేందుకు కృష్ణ ఇష్టపడేవారు కాదు. తన ప్రతి సినిమా కొత్తగా ఉండాలని, తాను చేసే ప్రతి పాత్రా విభిన్నంగా ఉండాలని కోరుకునేవారు. దానికి తగ్గట్టుగానే కథలు ఎంపిక చేసుకుంటూ విజయపరంపర కొనసాగించారు. తెలుగు లో కృష్ణ హీరోగా నటించిన `గూఢచారి 116` చిత్రం గూఢచారి చిత్రాకు మార్గాన్ని సుగమం చేసింది. `తేనెమనసులు` చిత్రంలో కృష్ణ డూప్ లేకుండా చేసిన ఓ యాక్షన్ సీన్ చూసిన డూండీ కృష్ణను తన సినిమాకు హీరోగా ఎంచుకున్నారు. ఒక పక్క `కన్నె మనసులు` చిత్రంలో అమాయకుడైన యువకుడిగా, మరో పక్కడ `గూఢచారి 116`లో బాండ్ పాత్రలో నటించి మెప్పించారు కృష్ణ. ఆ తర్వాత గూఢచారి నేపథ్యంలో సాగే ఎన్నో చిత్రాల్లో నటించి జేమ్స్‌బాండ్ అంటే కృష్ణే అనుకునేంతగా ఆకట్టుకున్నారు.
ఆ తర్వాత `మోసగాళ్లకు మోసగాడు` చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు కౌబాయ్‌ని పరిచయం చేశారు. హాలివుడ్ స్థాయిలో తీసిన ఈ చిత్రం ట్రెజర్ హంట్ పేరుతో విదేశీ భాషలకు అను వాదమైన తొలి తెలుగు చిత్రంగా చరిత్ర సృష్టించింది. అలాగే తమిళ్, హిందీ భాషల్లో కూడా ఈ సినిమా డబ్ అయింది. కృష్ణ నటించిన తొలి కలర్ క్రైమ్ చిత్రం `అవేకళ్లు`, అంతకు ముందు బ్లాక్ అండ్ వైట్‌లో చాలా క్రైమ్ సినిమాలు వచ్చినా ఈ సినిమా కలర్లో రూపొందింది. తర్వాత అసాధ్యుడు, సర్కార్ ఎక్స్‌ప్రెస్, జగత్ కిలాడీలు, పగ సాధిస్తా, అఖండుడు, పట్టుకుంటే లక్ష ఇలా పలు క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలతో పాటు రెండు కుటుంబాల కథ, మేనకోడలు, శ్రీమతి విజయ నిర్మల దర్శకురాలిగా తొలి సక్సెస్ సాధించిన మినా, ఆడంబరాలు అనుబంధాలు, దేవదాసు, మనవూరి కథ, మనస్సాక్షి, శంఖు తీర్థం, సిరిమల్లె నవ్వింది, బంగారు బావ, భోగిమంటలు, ప్రేమ నక్షత్రం, కలవారి సంసారం, రామరాజ్యంలో భీమరాజు, సూర్యచంద్ర, అజాత శత్రువు, నేరము శిక్ష వంటి నవలా చిత్రాల్లోనూ నటించి ఆకట్టుకున్నారు కృష్ణ.
తొలి రోజుల్లో కృష్ణ కొన్ని నాటకాలు వేయడమే కాకుండా పదండి ముందుకు, కులగోత్రాలు చిత్రాల్లో చిన్న పాత్రలు పోషించారు. ఆ తర్వాత ఆదుర్తి సుబ్బారావు `తేనె మనసులు` చిత్రంతో కృష్ణను హీరోగా పరిచయం చేశారు. తొలి చిత్రంతోనే కృష్ణ భారీ విజయాన్ని సొంతం చేసుకుని అందరి దృష్టిలో పడ్డారు. ఆ సినిమా తర్వాత అవకాశాలు రావడం మొదలైంది. అయితే ఒకే తరహా పాత్రలు చేసేందుకు కృష్ణ ఇష్టపడేవారు కాదు. తన ప్రతి సినిమా కొత్తగా ఉండాలని, తాను చేసే ప్రతి పాత్రా విభిన్నంగా ఉండాలని కోరుకునేవారు. దానికి తగ్గట్టుగానే కథలు ఎంపిక చేసుకుంటూ విజయపరంపర కొనసాగించారు.
తెలుగు లో కృష్ణ హీరోగా నటించిన `గూఢచారి 116` చిత్రం గూఢచారి చిత్రాకు మార్గాన్ని సుగమం చేసింది. `తేనెమనసులు` చిత్రంలో కృష్ణ డూప్ లేకుండా చేసిన ఓ యాక్షన్ సీన్ చూసిన డూండీ కృష్ణను తన సినిమాకు హీరోగా ఎంచుకున్నారు. ఒక పక్క `కన్నె మనసులు` చిత్రంలో అమాయకుడైన యువకుడిగా, మరో పక్కడ `గూఢచారి 116`లో బాండ్ పాత్రలో నటించి మెప్పించారు కృష్ణ. ఆ తర్వాత గూఢచారి నేపథ్యంలో సాగే ఎన్నో చిత్రాల్లో నటించి జేమ్స్‌బాండ్ అంటే కృష్ణే అనుకునేంతగా ఆకట్టుకున్నారు. ఆ తర్వాత `మోసగాళ్లకు మోసగాడు` చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు కౌబాయ్‌ని పరిచయం చేశారు. హాలివుడ్ స్థాయిలో తీసిన ఈ చిత్రం ట్రెజర్ హంట్ పేరుతో విదేశీ భాషలకు అను వాదమైన తొలి తెలుగు చిత్రంగా చరిత్ర సృష్టించింది. అలాగే తమిళ్, హిందీ భాషల్లో కూడా ఈ సినిమా డబ్ అయింది.
కృష్ణ నటించిన తొలి కలర్ క్రైమ్ చిత్రం `అవేకళ్లు`, అంతకు ముందు బ్లాక్ అండ్ వైట్‌లో చాలా క్రైమ్ సినిమాలు వచ్చినా ఈ సినిమా కలర్లో రూపొందింది. తర్వాత అసాధ్యుడు, సర్కార్ ఎక్స్‌ప్రెస్, జగత్ కిలాడీలు, పగ సాధిస్తా, అఖండుడు, పట్టుకుంటే లక్ష ఇలా పలు క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలతో పాటు రెండు కుటుంబాల కథ, మేనకోడలు, శ్రీమతి విజయ నిర్మల దర్శకురాలిగా తొలి సక్సెస్ సాధించిన మినా, ఆడంబరాలు అనుబంధాలు, దేవదాసు, మనవూరి కథ, మనస్సాక్షి, శంఖు తీర్థం, సిరిమల్లె నవ్వింది, బంగారు బావ, భోగిమంటలు, ప్రేమ నక్షత్రం, కలవారి సంసారం, రామరాజ్యంలో భీమరాజు, సూర్యచంద్ర, అజాత శత్రువు, నేరము శిక్ష వంటి నవలా చిత్రాల్లోనూ నటించి ఆకట్టుకున్నారు కృష్ణ.
కృష్ణ మూడు చారిత్రాత్మక చిత్రాల్లో నటించారు. అందులో పద్మాలయా బేనర్లో నిర్మించిన `అల్లూరి సీతారామరాజు` ఆయన కెరీర్లోనే గొప్ప సినిమాగా నిలిచిపోయింది. కృష్ణ తప్ప మరెవరూ ఆ పాత్రను చేయలేరు అనేంత గొప్పగా నటించారు. తొలి కలర్ సినిమా తేనెమనసులు, తొలి కలర్ క్రైమ్ సినిమా అవేకళ్లు. అలాగే తొలి సినిమాస్కోప్ సినిమా అల్లూరి సీతారామరాజు కావడం విశేషం. ఆ తర్వాత కృష్ణ దర్శకత్వంలో రూపొందిన తొలి సినిమా సింహాసనం తెలుగులో తొలి 70 ఎంఎం స్టీరియో ఫోనిక్ సినిమా. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ బప్పిలహిరి `సింహాసనం` చిత్రంతోనే తెలుగులో పరిచయమయ్యారు. షోలేలో గబ్బర్‌సింగ్ పాత్రలో నటించిన అంజాద్‌ఖాన్ కూడా ఇందులో నటించడం విశేషం. సాంఘిక చిత్రాల్లోనే కాదు పౌరాణిక, జానపద చిత్రాల్లోనూ తనదైన నటనతో అందర్నీ మెప్పించారు
కృష్ణ. మల్లమ్మ కథ, కురుక్షేత్రము, ఏలకవ్య వంటి పౌరాణిక చిత్రాలతో పాటు ఇద్దరు మొనగాళ్లు, బొమ్మలు చెప్పిన కథ, మహాబలుడు, సింహగర్జన, సింహాసనం, వంటి జానపద చిత్రాల్లో నటించారు. ఎన్.టి.రామారావు అంటే కృష్ణకు ఎంతో అభిమానం. తన అభిమాన నటుడైన యన్.టి.ఆర్తో పద్మాలయా బ్యానర్లో దేవుడు చేసిన మనుషులు వంటి భారీ మల్టీ స్టారర్‌ని నిర్మించారు. ఈ సినిమాలో యన్.టి.ఆర్తో కలిసి నటించారు కూడా. తను ఎంతో గౌరవించే అక్కినేని నాగేశ్వరరావుతో హేమాహేమీలు, రాజకీయ చదరంగం లాంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. మల్టీస్టారర్ చిత్రాల చరిత్రలో కొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన కృష్ణ 50కి పైగా మల్టీస్టారర్ చిత్రాల్లో నటించి అత్యధిక మల్టీస్టారర్స్‌లో నటించిన ఏకైక హీరోగా రికార్డ్‌ని సృష్టించారు.
ఎన్.టి.ఆర్, ఎ.ఎన్.ఆర్, శివాజీ గణేషన్, రజనీకాంత్, శోభన్‌బాబు, కృష్ణంరాజు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, మోహన్ బాబు, మురళి మోహన్, రాజశేఖర్, రవితేజ.. ఇలా అందరు హీరోలతో కలిసి నటించిన క్రెడిట్ సూపర్ స్టార్ కృష్ణకు మాత్రమే సొంతం. హీరోగా ఎక్కువ సినిమాలు చేయడమే కాదు. ఎక్కువ విజయాలను సాధించిన ఘనత కూడా సూపర్‌స్టార్ కృష్ణకే దక్కుతుంది. 1972లో ఏకంగా 18 చిత్రాల్లో హీరోగా నటించి రికార్డ్ సృష్టించారు. ఆ 18 సినిమాల్లో గోల్డెన్ జూబ్లి హిట్‌గా నిలిచి అప్పటికి ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించిన కుటుంబ కథా చిత్రం పండంటి కాపురం, సిల్వర్ జూబ్లి హిట్ ఇల్లు ఇల్లాలు ఉన్నాయి. ఒక్క అబ్బాయిగారు అమ్మాయిగారు మాత్రమే నిరాశ పరిచింది. మాస్ ఇమేజ్ ఉన్న సూపర్ స్టార్‌కృష్ణ ఒక పక్క కమర్షియల్ సినిమాలు చేస్తూ సూపర్ హిట్స్ కొడుతూనే హీరోయిన్, డ్యూయెట్ లేకుండా ఒక పవర్ఫుల్ కార్మిక నాయకుని పాత్ర పోషించి తన 200వ సినిమాగా ఈనాడు లాంటి పవర్ఫుల్ పొలిటికల్ సినిమా తీయడం అది సూపర్ హిట్ అవడం కృష్ణ కెరీర్లో ఒక మరుపురాని ఘట్టం. అలాగే ఒక పక్క కలర్ సినిమాలు ప్రభంజనం సృష్టిస్తోన్న సమయం, చాలా మంది ఆ సబ్జెక్ట్ కమర్షియల్‌గా ఆడదు అని నిరుత్సాహపరిచినా విజయనిర్మల దర్శకత్వంలో ఫైట్లు, డ్యూయెట్లు లేకుండా మీనా లాంటి ఒక సాఫ్ట్ మూవీని బ్లాక్ అండ్ వైట్‌లో చేయడం అది కూడా సూపర్ హిట్ అవడం నిజంగా ఒక సాహసం.
1985లో ‘అగ్నిపర్వతం, వజ్రాయుధం, పల్నాటి సింహం’ వంటి బ్లాక్ బస్టర్స్‌తో ‘పచ్చనికాపురం, సూర్యచంద్ర’ వంటి సూపర్ హిట్స్‌తో ఒకే సంవత్సరంలో 5 సూపర్‌డూపర్ హిట్స్ ఇచ్చిన ఘనత కూడా కృష్ణదే. ‘అసాధ్యుడు, పాడి పంటలు, ఊరికి మొన గాడు,‘అగ్నిపర్వతం, బంగారు భూమి, ఇద్దరు దొంగు, అమ్మ దొంగా, నెంబర్‌వన్, పచ్చని సంసారం, సంప్రదాయం’ వంటి సంక్రాంతి హిట్స్ సూపర్‌స్టార్‌ని సంక్రాంతి హీరోని చేసాయి. వరుసగా ఎడతెరపి లేకుండా సినిమాలు చేసి ఇండస్ట్రీ ఎదుగదలకు పాటుపడటమే కాకుండా ఒక సినిమా సరిగా ఆడకపోతే ఆ నిర్మాతని పిలిచి మరో సినిమాకి డేట్స్ ఇచ్చి సినిమా చేసుకోమనే మంచి మనసున్న మనిషి కృష్ణ. అందుకే ఆయన్ను అందరూ నిర్మాతల హీరో అంటారు. ఒక హీరోగానే కాదు.. నిర్మాతగా ‘మోసగాళ్ళకు మోసగాడు, పండంటి కాపురం, దేవుడు చేసిన మనుషులు, అల్లూరి సీతారామరాజు, పాడి పంటలు, ఈనాడు’ వంటి సంచన చిత్రాలు నిర్మించిన కృష్ణ దర్శకుడిగా ‘సింహాసనం, ముగ్గురు కొడుకులు, కొడుకు దిద్దిన కాపురం, కలియుగ కర్ణుడు’ వంటి ఎవర్గ్రీన్ హిట్ చిత్రాలతో తన ప్రతిభను నిరూపించుకున్నారు. కేవం తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ చిత్రాలను సూపర్ స్టార్ కృష్ణ పద్మాలయా బ్యానర్‌పై నిర్మించారు.
భారతదేశంలోనే ఒక అగ్ర నిర్మాణ సంస్థగా నిబడడానికి కృష్ణ సోదరులు హనుమంతరావు, ఆదిశేషగిరిరావు కృషి ఎంతో ఉంది. అలాగే శ్రీమతి విజయ నిర్మల దర్శకత్వంలో విజయ కృష్ణ బ్యానర్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను సమర్పించారు కృష్ణ. సూపర్ స్టార్ కృష్ణ సాధించిన అన్ని విజయాల్లో విజయ నిర్మల తోడుగా ఉన్నారు. సామ్రాట్, బజారు రౌడీ, ముగ్గురు కొడుకులు వంటి హిట్ చిత్రాల్లో నటించిన కృష్ణ పెద్ద తనయుడు రమేశ్‌బాబు నిర్మాతగా అర్జున్, అతిథి వంటి భారీ చిత్రాలను నిర్మించారు.
దూకుడు వంటి ఇండస్ట్రీ హిట్‌ను సమర్పించారు. రమేశ్‌బాబు తనయుడు జయకృష్ణ సినీ రంగ ప్రవేశం గురించి అభిమానులు ఎదురు చూస్తున్నారు. కృష్ణ చిన్నల్లుడు సుధీర్‌బాబు హీరోగా తన కంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. కృష్ణ పెద్దమ్మాయి పద్మ, గల్లా జయదేవ్ తనయుడు అశోక్ గల్లా హీరోగా నటిస్తోన్న చిత్రం నిర్మాణంలో ఉంది. కృష్ణ రెండో కుమార్తె మంజు నటిగా, డైరెక్టర్‌గా, నిర్మాతగా రాణిస్తుండగా అల్లుడు సంజయ్ నిర్మాతగా, నటుడిగా మంచి పేరు తెచ్చుకుంటున్నారు.
మహేశ్ తనయుడు గౌతమ్ 1 నేనొక్కడినే చిత్రంతో చైల్డ్ స్టార్‌గా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. సితార పాప తన డ్యాన్స్‌తో సింగింగ్‌తో సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇలా సూపర్‌స్టార్ ఫ్యామిలీ మొత్తం సినిమా రంగంతో కనెక్ట్ అయ్యి ఉన్నారు.