
నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్ హత్యపై అమెరికా భగ్గుమంది. జార్జి సొంత రాష్ట్రమైన మినెసోటా రాష్ట్రం వరుసగా మూడవ రోజున నిరసనలతో హోరెత్తింది. నిరసనకారులను శాంతింప జేయడానికి బదులు వారిని రెచ్చగొట్టే విధంగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు పరిస్థితిని మరింత దిగజార్చాయి. సైన్యాన్ని దింపి.. కాల్చి పారేస్తాం అని ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై అన్ని వైపుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. హింసను రెచ్చగొట్టేలా ట్రంప్ చేసిన ఈ ట్వీట్‌ను విమర్శలు వచ్చాయి. హింసను రెచ్చగొట్టేలా ట్రంప్ చేసిన ఈ ట్వీట్‌ను నిలిపేస్తున్నట్టు ట్విట్టర్ సంస్థ ప్రకటించింది. ట్రంప్ వ్యాఖ్యలపై ఆగ్రహించిన ఆందోళనకారులు మినెయాపోలీస్లోని పోలీస్ స్టేషన్‌ను తగులబెట్టారు. నిరసనలు, ఆందోళనలతో అమెరికా ఆట్టుడికిపోయింది.