నాబార్డు చైర్మన్‍గా చింతల బాధ్యతలు

Chintala Govindarajulu is new chairman for Nabard

బెంగళూరులోని ప్రధాన కార్యాలయంలో జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డు) చైర్మన్‍గా చింతల గోవిందరాజులు బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని భారతీయ వ్వవసాయ పరిశోధనా సంస్థలో పోస్టు గ్రాడ్యుయేషన్‍ చేసిన చింతల.. 1985లో నాబార్డు ప్రధాన కార్యాలయంలో గ్రేడ్‍- బీ అధికారిగా చేశారు. అనంతరం ముంబై, హైదరాబాద్‍, చండీగఢ్‍, లక్నో, అండమాన్‍ నికోబార్‍ దీవులు, ఢిల్లీతో సహా ప్రాంతీయ కార్యాలయాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు.