రాజ్యసభకు దేవెగౌడ, ఖర్గే!

Mallikarjun Kharge and Deve Gowda to RS

కర్ణాటక నుంచి మాజీ ప్రధాని హెచ్‍డీ దేవెగౌడ్‍ (జేడీఎస్‍), సీనియర్‍ కాంగ్రెస్‍ నేత మల్లికార్జున ఖర్గే రాజ్యసభలోకి ప్రవేశించనున్నారు. ఈ మేరకు కాంగ్రెస్‍, జేడీఎస్‍ మధ్య ఒప్పందం కుదిరింది. కాంగ్రెస్‍ అధిష్ఠానం దీనికి ఆమోదం వేయడమే తరువాయి. గత లోక్‍సభ ఎన్నికల్లో దేవెగౌడ తుమకూరులో పోటీ చేసి ఓడిపోగా, గుల్బర్గాలో ఖర్గే తొలిసారి ఓటమి పాలయ్యారు. ఈ సీనియర్‍ నేతలిద్దరినీ రాజ్యసభకు పంపించే అంశంపై కొద్దిరోజులుగా కసరత్తు జరుగుతోంది. కాగా బీజేపీ మాత్రం ఇంకా తన అభ్యర్థుల గుట్టు విప్పలేదు.