అగౌరవంగా ఉంది : ట్రంప్

Donald Trump says having most coronavirus cases in world in USA

కరోనా వైరస్‍ కేసుల్లో ప్రపంచంలోనే అత్యధికంగా అమెరికాలోనే నమోదవడంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది తమ గౌరవానికి భంగకరంగా ఉందన్నారు. కరోనా పాజిటివ్‍ కేసుల్లోనే కాదు, మృతుల్లోనే అమెరికా అగ్రస్థానంలో నిలవడం నిజంగా తనకు చాలా బాధేస్తోందన్నారు. అయితే ఒక విషయంలో తనకు గర్వంగా ఉందని, టెస్టింగ్‍లో అమెరికా అవలంభిస్తున్న విధానంలో ప్రపంచంలోనే అత్యుత్తమైనదని పేర్కొన్నారు. భారీ స్థాయిలో టెస్టింగ్‍లు నిర్వహించడంతోనే కేసుల సంఖ్య అత్యధికంగా నమోదవుతున్నాయని తెలిపారు.

 


                    Advertise with us !!!