‘నేనే రాధ.. నేనే భార్య’ అంటున్న కాజల్‌

Kajal Character Intro of Nene Raju Nene Mantri

రానా కథానాయకుడిగా తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘నేనే రాజు నేనే మంత్రి’. ‘లక్ష్మీకల్యాణం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కాజల్‌ ఆ తర్వాత టాప్‌ హీరోయిన్‌గా ఎదిగింది. తనను టాలీవుడ్‌కు పరిచయం చేసిన డైరెక్టర్‌ తేజ డైరెక్షన్‌లో చాలా రోజుల తర్వాత నటిస్తోంది. ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్న కాజల్‌ ఫస్ట్‌లుక్‌ను శనివారం ట్విటర్‌ ద్వారా విడుదల చేశారు. ‘నేనే రాధ నేనే భార్య’ అంటూ చక్కనైన చీరకట్టులో ఉన్న కాజల్‌ చూడముచ్చటగా ఉన్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్‌కు అభిమానుల నుంచి విశేష స్పందన వస్తోంది. ఇందులో రానా రాధా జోగేంద్ర అనే మంత్రి పాత్రలో నటిస్తున్నారు. రానా భార్యగా కాజల్‌ అగర్వాల్‌ నటిస్తోంది. డి.సురేశ్‌బాబు, కిరణ్‌రెడ్డి, భరత్‌ చౌదరిలు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళంలోనూ నిర్మిస్తున్నారు. అనూప్‌ రూబెన్స్‌ ఈ సినిమాకి సంగీతం సమకూరుస్తున్నారు.

 


                    Advertise with us !!!