డైరెక్టర్ రామ్‌గోపాల్‌వర్మ వివాదాల్లో నిలవడంలోనే కాదు, వివాదాస్పద సినిమాలు తియ్యడంలోనూ దిట్టే. ఈమధ్యకాలంలో వర్మ చేసిన సినిమాలన్నీ వివాదాల్లో చిక్కుకున్నవే. అవి రాజకీయ నేపథ్యంలో వచ్చిన సినిమాలు కావచ్చు, మరే సినిమాలైనా కావచ్చు. ఆ సినిమాలు నిర్మాణంలో ఉన్న దగ్గర నుంచి రిలీజ్ అయ్యే వరకు మీడియాకు బోలెడంత పని ఉంటుంది. ఇప్పుడు తాజాగా మరో విభిన్నమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు వర్మ. పోర్న్ స్టార్‌గా పేరు పొందిన మియా మల్కోవా ప్రధాన పాత్రలో ‘క్లైమాక్స్’ అనే యాక్షన్ థ్రిల్లర్‌ను తెరకెక్కిస్తున్నాడు వర్మ. ఎడారి నేపథ్యంలో సాగే ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీ ఇది.
ఈ సినిమాలో యాక్షన్‌తోపాటు యూత్‌ని ఆకట్టుకునే అందాల ఆరబోత కూడా ఉంది. మియా మల్కోవా తన అందాలతో ప్రేక్షకులకు కనువిందు చేయనుంది. ఈ సినిమా టీజర్‌ను సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు వర్మ. టీజర్లోనే బోలెడంత స్టఫ్ ఉంది. మే 18 ఉదయం 9.30 గంటలకు ట్రైలర్ విడుదల కాబోతోందని ఈ టీజర్లోనే ఎనౌన్స్ చేశారు. కంపెనీ, ఆర్ఎస్ఆర్ ప్రొడక్షన్స్ పతాకాలపై శ్రేయాస్ ఇటి సమర్పణలో ఈ చిత్రాన్ని నిర్మించారు. తనదైన స్టైల్లో రామ్‌గోపాల్‌వర్మ చేసిన ఈ సినిమాతో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడేమో చూడాలి.