ఎంఐ 10 5జి ఫోన్‌ను 108 ఎంపి కెమెరాతో విడుదల చేసిన షావోమి ఇండియా

Xiaomi Mi 10 5G Launch Impressions

ఇండియా 3డి కర్వ్‌డ్ ఇ3 అమోల్డ్ డిస్‌ప్లే మరియు అత్యంత వేగమైన 30వాట్ వైర్‌లెస్ ఛార్జింగ్‌

కంటెంట్‌ను మరింత ఉన్నతంగా ఆస్వాదించేందుకు ఎంఐ ట్రూ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ 2 మరియు ఎంఐ బాక్స్ 4కెను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చింది.

భారతదేశపు నంబర్ ఒన్ స్మార్ట్‌ఫోన్ మరియు స్మార్ట్ టీవీ బ్రాండ్ షావోమి ఇండియా నేడు తన అత్యాధునిక స్మార్ట్‌ఫోన్‌ ఎంఐ10 5జిను భారతదేశంలోని ప్రీమియం ఫ్లాగ్‌షిప్ పోర్ట్‌ఫోలియోలో రెండు నూతన ఐఒటి ఎకోసిస్టం ఉత్పత్తులతో విడుదల చేసింది. 180 ఎంపి క్వాడ్-కెమెరా సెటప్, 5జి కనెక్టివిటీ కోసం 865 చిప్‌సెట్ క్వాల్‌కాం® స్నాప్‌ డ్రాగన్™, 3డి కర్వ్‌డ్ అమోల్డ్ డిస్‌ప్లే, శక్తియుత 4780 ఎంఎహెచ్ బ్యాటరీ మరియు 30వాట్ వైర్‌లెస్ ఛార్జింగ్ కలిగిన ఎంఐ 10 ప్రీమియం స్మార్ట్ ‌ఫోన్ అనుభవాన్ని అందించడంలో ఉన్నత శిఖరాల స్థాయిని చేరుకుంది.

విస్తరిస్తున్న తన పోర్ట్‌ఫోలియో వ్యవస్థలో భాగంగా షావోమీ ఎంఐ ట్రూ వైర్‌లెస్ ఇయర్ ‌ఫోన్స్ 2 మరియు ఎంఐ బాక్స్ 4కెను కూడా విడుదల చేసింది. ఎంఐ ట్రూ వైర్‌లెస్ ఇయర్ ఫోన్స్ 2 పూర్తి, విస్తృత స్థాయి శబ్దాన్ని, సహజంగా సమతుల్యత, శబ్ద-నాణ్యతల ఫ్రీక్వెన్వీని అందించేలా రూపొందించగా, ఎంఐ బాక్స్ 4కెను అన్ని టీవీల వినియోగదారులకూ స్మార్ట్ టీవీ అనుభవాన్ని అందించేలా డిజైన్ చేశారు.

 


                    Advertise with us !!!