మనిషి విలువలు పెరిగి మానవత్వం పరిమళిస్తున్న సమయం ఈ కరోనా లాక్ డౌన్ -‌ గోపీచంద్‌

hero gopichand interview

కరోనా సంక్షోభం వలన సినిమా షూటింగు లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సినీ కార్మికులకు తన వంతు సహాయం అందించాడు గోపీచంద్. అంతే కాకుండా తన ఇంటి పరిసరాల్లో వున్నా పేద కుటుంభాలకు నిత్యావసర వస్తువులు, ఆహరం అందించి తన ఉదారతను చాటుకున్నా ఈ మ్యాచోస్టార్‌ గోపీచంద్‌ హీరోగా మాస్‌ డైరెక్టర్‌ సంపత్‌ నంది దర్శకత్వంలో ‘యు టర్న్‌’లాంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని అందించిన శ్రీనివాసా స్విలర్‌ స్క్రీన్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెం.3గా శ్రీనివాసా చిట్టూరి నిర్మాతగా హై బడ్జెట్‌, అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందుతోన్న భారీ చిత్రం ‘సీటీమార్‌’. ఈ ప్రెస్టీజియస్‌ మూవీలో మిల్కీబ్యూటి తమన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. తరుణ్‌ అరోర ప్రతి నాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే 50% చిత్రీకరణ పూర్తి చేసుకుని లాక్‌డౌన్‌ వల్ల వాయిదా పడిరది. కరోనా ప్రభావంతో స్టే హోమ్ స్టే సేఫ్ పాటిస్తూ ఈ విరామ సమయం లో ఏం చేస్తున్నారో మ్యాచోస్టార్‌ గోపీచంద్‌ చెప్పిన ముచ్చట్లివీ...

షూటింగ్‌కి వెళ్లడం లేదే అని మీ వాళ్ళు ఏమైనా అడుగుతున్నారా?

- మా పెద్దబ్బాయి విరాట్‌ అడిగాడు. కరోనా వైరస్‌ వచ్చిందనీ, బయటికి వెళ్లకూడదని, చేతుల్ని శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పా. తనక్కూడా అర్థమైంది. ఇంట్లోకి ఎవ్వరినీ రానివ్వకూడదు కదా అంటూ, శానిటైజర్‌తో చేతు కడుగుతున్నాడు (నవ్వుతూ). ఆరేళ్లొచ్చాయి కాబట్టి ఏం చెప్పినా వెంటనే అర్థం చేసుకుంటున్నాడు.

కుటుంబంతో గడిపేందుకు ఇదొక మంచి అవకాశం కదా?

- మా పెద్దబ్బాయితో హోమ్‌ వర్క్‌ చేయిస్తున్నా, డ్రాయింగ్‌ వేయిస్తున్నా. బిజిగా తీరిక లేని జీవితంతో ఫామిలీతో గడపలేకపోయిన వాళ్లకి ఈ విరామం గొప్ప అవకాశం. ఇది వరకు నేను పిల్లల్ని చూసుకోవడంలో కష్టం ఏముందిలే అనుకునేవాణ్ని. అసలు విష్యం ఇప్పుడు అర్థమవుతోంది. మా చిన్నబ్బాయి వియాన్‌ ఇప్పుడు పరిగెడుతున్నాడు. ఇద్దరూ ఏదో ఒక వస్తువు కోసం పోటీపడుతుంటారు. వాళ్లని కంట్రోల్‌ చేయడం చాలా పెద్ద పనే.

కరోనా పరిణామాలపై మీకెలాంటి ఆలోచలు వస్తున్నాయి?

- లోకమంతా ఇలా ఒకే విషయంపై ఆగిపోయే రోజులొస్తాయని కలలో కూడా ఊహించలేదు. ప్రపంచానికి ఇదొక సంకేతంలా అనిపిస్తోంది. యంత్రం లా స్పీడ్ గా కొనసాగే లైఫ్ లో ఓయ్ కొంచెం ఆగండి, మీరేం చేస్తున్నారో ఒక్క సారి ఆలోచించండి అని చెప్పినట్టు ఉంది. ఈ కొన్నాళ్లల్లోనే ప్రకృతిలో చాలా మార్పు చూశా. యాభై శాతం కాలుష్యం తగ్గిపోయింది. పక్షులు, జంతువుల స్థానాన్ని మనం ఇంతగా ఆక్రమించేశామా అనిపించింది. మా ఇంటి పక్కన పార్క్‌లో పక్షులు ఉండేవి కాదు. ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాటి కిల కిల రవాలతో మనసు ఎంతో ఆహ్లదపరుస్తోంది.

దేవుడు ఇచ్చిన స్వేచ్ఛ వాటికి ఇప్పుడు వచ్చినట్టు అనిపిస్తోంది. కరోనా వల్ల మనలో మార్పు వస్తుంది. ఇకపై మన జీవితాలు మరోలా ఉండబోతున్నాయి అనిపిస్తుంది. ఇప్పుడు డబ్బున్నోడు, లేనోడు ఒక్కటే. ఒకరికొకరు సాయం చేసుకోవాలి, పక్కవాడు బాగుంటే మనం బాగుంటామనే ధోరణిలో మనం ఆలోచిస్తున్నాం. మనిషి విలువ ఇప్పుడు తెలుస్తుంది.

లాక్ డౌన్ తర్వాత సినీ పరిశ్రమలో పరిస్థితులు ఇదివరకటిలా ఉండవేమో కదా? 

- కచ్చితంగా కొన్ని మార్పులైతే వస్తాయి. కరోనాకి వ్యాక్సిన్‌ వచ్చాక గానీ అందరికీ పూర్తిగా ధైర్యం రాదు. అప్పటిదాకా భయంగా భయంగా బతకాల్సిందే. సినిమా అంటే ఎక్కువమంది కలిసి పనిచేయాల్సి ఉంటుంది, సినిమా చూసేది కూడా సమూహంగానే. మనం కష్టపడి చిత్రీకరణ పూర్తి చేసినా థియేటర్‌కి ప్రేక్షకులు రావాలి కదా, వాళ్లు రావాలంటే ముందు భయం తొలిగిపోవాలి. ఇదంతా జరగడానికి సమయం పడుతుంది.

ఈ సమయంలో మీకు ఏమైనా మిస్‌ అయ్యామన్న ఫీలింగ్‌ ఉందా?

` స్నేహితుతో కలిసి గడపడమంటే నాకు చాలా ఇష్టం. అదిప్పుడు బాగా మిస్‌ అవుతున్నా. ఫోన్‌లో టచ్‌లో ఉంటున్నాం. ప్రభాస్‌, నేను అప్పుడప్పుడు మాట్లాడుకుంటున్నాం. కరోనా ప్రభావం మొదలైన సమయంలోనే తను జార్జియా వెళ్లాడు. నేను ‘అక్కడ ఇలా ఉందంట, ఇక్కడిలా ఉందంట.. జాగ్రత్త’ అంటూ మెసేజెస్‌ పంపుతుండేవాణ్ని. ‘ఏం పర్లేదురా, ఇప్పటివరకూ బాగానే ఉంది, మేం కూడా వచ్చేస్తున్నాం’ అని తిరిగి వచ్చేసాడు. తను తిరిగొచ్చాక 14 రోజు స్వీయ క్వారంటైన్‌లోనే ఉన్నాడు’’.

ప్రస్తుతం మీరు చేస్తున్న ‘సీటీమార్‌’ సినిమా ఎంతవరకూ వచ్చింది? 

‘- 'సీటీమార్‌’ సినిమా 50 శాతం పూర్తయింది. ద్వితీయార్ధం మొదలైన సమయంలోనే కరోనాతో బ్రేక్‌ పడిరది. కుటుంబ అనుబంధాతో కూడిన క్రీడా నేపథ్య చిత్రం. నేను, తమన్నా ఇద్దరం కబడ్డీ కోచ్లుగా కనిపిస్తాం. ప్రొ కబడ్డీ చూసి నా పాత్ర కోసం సిద్ధమయ్యా. ఆట గురించి అన్ని విషయాలు తెలుసుకున్న.. అలాగే సంపత్‌ నందితో ఇదివరకే ఒక సినిమా చేశాను. వెరీ టాలెంటైడ్‌ డైరెక్టర్‌. ఈ చిత్రాన్ని కూడా అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. ఇటీవ విడుదల చేసిన ఫస్ట్‌ుక్‌కి కూడా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. అలాగే మా నిర్మాత శ్రీనివాసా చిట్టూరి గారు ప్రెస్టీజియస్‌గా ఈ మూవీని నిర్మిస్తున్నారు.

మీ సినీ కెరీర్లో ఒక మలుపు తిప్పిన తేజతో సినిమా ఎప్పుడూ?

- తేజతో నేను ఎప్పుడో సినిమా చేయాలి. ఆయన ఈమధ్యే ‘అలివేలు మంగ వేంకటరమణ’ అనే కథ చెప్పారు. అది చాలా నచ్చింది. ఆమధ్య రజనీకాంత్‌ సినిమాలో నటిస్తున్నావట కదా అని కొంతమంది తమిళ స్నేహితు ఫోన్‌ చేసి అడిగారు. నిజం కాదని చెప్పా. రజనీతో సినిమా చేస్తున్న దర్శకుడు శివ, నేను కలిసి రెండు సినిమాలు చేశాం. శివ, నేను అప్పుడప్పుడు మాట్లాడుకుంటుంటాం. మీరెప్పుడు చెబితే అప్పుడు సినిమా చేస్తాను సర్‌ అంటుంటాడు. ‘నువ్వు తమిళంలో బాగా చేస్తున్నావు కదా, పెద్ద హీరోతో చేయడం నీకు మంచిది. మనం తర్వాత చూసుకుందాం’ అని చెబుతుంటా’.