
పోలీసులకు ఉచితంగా ఐసోలేషన్ గౌన్లు
కరోనా పై పోరాటంలో ముందుండి పోరాడే వారికి సరైన రక్షణ కవచాల కొరత ఇప్పుడు అమెరికాలో పెద్ద సమస్యగా మారింది. ఈ తరుణంలో వారికి ధైర్యాన్నిస్తూ నాట్స్ మాజీ అధ్యక్షుడు శ్యామ్ మద్దాళి ఉచితంగా గౌన్లు, మాస్కులు అందచేస్తున్నారు. గతంలో న్యూజెర్సీ పరిసర ప్రాంతాల్లోని ఆసుపత్రులకు ఉచితంగా మాస్కులు పంపిణీ చేసిన శ్యామ్ మద్దాళి .. తాజాగా పోలీసులకు కూడా ఐసోలేషన్ గౌన్లు ఉచితంగా అందించారు. కరోనాపై పోరాటంలో పోలీసుల పాత్ర కూడా కీలకమే.. లాక్డౌన్ పటిష్టంగా అమలు చేయడంలో వారు నిరంతర కృషి చేస్తున్నారు.
ఈ తరుణంలో వారు కరోనా బారిన పడకుండా ఉండేందుకు నాట్స్ వారికి ఐసోలేషన్ గౌన్లు అందించే నిర్ణయం తీసుకుంది. శ్యామ్ మద్ధాళి వీటిని ఉచితంగా పోలీసులకు అందించి మానవత్వాన్ని చాటుకున్నారు.