
మహీంద్రా అండ్ మహీంద్ర కంపెనీ చైర్మన్ ఆనంద్ మహీంద్ర, వ్యాపార విస్తరణలోనూ తన జోరును చూపుతున్నారు. ఇప్పటికే ఎన్నో విజయవంతమైన వెంచర్లను ప్రారంభించిన ఆనంద్ మహీంద్రా తన వ్యాపార విస్తరణను అమెరికా వరకు తీసుకెళ్లారు. ఉత్తర అమెరికాలోని ఆబర్న్ హిల్స్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ప్లాంట్‌లో కార్యకలాపాలు గురువారం నుంచి తిరిగి ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా ఆనంద్ మహీంద్రా తన సంస్థ ఉద్యోగులకు ఆల్ ద బెస్ట్ చెప్పారు. బాగా ప్రారంభించండి. సురక్షితంగా ప్రారంభించండి. మీ అందరికీ శుభాకాంక్షలు టీం మహీంద్రా ఆటోనా అని ట్వీట్టర్లో రాశారు. మిచిగాన్ ఆబర్న్ హిల్స్‌లోని మహీంద్రా ప్లాంట్ అమెరికాలో తొలి రాక్సర్ ఉత్పత్తులను ప్రారంభించిన సంస్థగా వినుతికెక్కింది. 2019లో తన రెండవ ప్లాంట్‌ను ప్రారంభించే ప్రణాళికలను సంస్థ సిద్ధం చేస్తున్నట్టుగా ఇదివరకే వెల్లడించారు. కొవిడ్ 19 నేపథ్యంలో రెండో ప్లాంట్ ప్రారంభానికి ఆలస్యమైనట్లు తెలుస్తున్నది.