యాక్టర్ నిఖిల్ డాక్టర్ పల్లవి వర్మల పెళ్లి జరిగింది

ముహూర్తం : ఉదయం – 06:31 ని”లకు
వేదిక : షామిర్ పెట్ లోని ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్

ప్ర‌తిఒక్క‌రి జీవితంలో పెళ్ళి గ‌డియలు వ‌స్తాయి. ఆ గ‌డియలు వ‌చ్చినప్పుడు జ‌ర‌గాల్సిందే. అలాంటి పెళ్లి గడియ హీరో నిఖిల్ వచ్చింది అదీ మాంచి లాక్ డౌన్ సమయంలో పెళ్లి ఘడియ వచ్చింది.  ఈ రోజు 2020 మే 14న ఉదయం – 06:31 ని”లకు, షామిర్ పెట్ లోని ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో కేవలం 30మంది బంధుమిత్రుల సమక్షం  లో నిరాడంబరంగా పెళ్లి వేడుక జరిగింది. హ్యాపీ డేస్ చిత్రం నుండి ఇప్పటి వరకు 18 సినిమాల్లో నటించిన నిఖిల్  స్వామిరారా, సూర్య వ‌ర్స‌స్ సూర్య‌, కార్తికేయ‌, ఎక్క‌డకి పోతావు చిన్న‌వాడా, కేశ‌వ‌, అర్జున్ సుర‌వ‌రం లాంటి వ‌రుస విజ‌యాలు సొంతం చేసుకున్న యంగ్ ఎన‌ర్జిటిక్ హీరో నిఖిల్ కి పెళ్లి  డాక్ట‌ర్ ప‌ల్ల‌వి వ‌ర్మ తో జరిగింది.   అయితే ప్ర‌పంచం మెత్తాన్ని క‌రొనా మ‌హ‌మ్మారి వ్యాపించి ఎక్క‌డి వారిని అక్క‌డే వుండేలా మ‌నుషుల మ‌ద్య దూరం వుండేలా చేసింది. ఈ ప‌రిస్థితిలో నిఖిల్ పెళ్ళి వాయిదా వేసుకున్నారు. అయితే క‌ళ్యాణం వ‌చ్చినా కక్కు వ‌చ్చినా ఆగ‌దు అనే పెద్ద‌ల సామెత నిజమైంది.  లాక్‌డౌన్ త‌రువాత మూఢం రావ‌టం.. ముహుర్తాలు లేక‌పోవ‌టం వ‌ల‌న వధూవరుల  ఇద్ద‌రి జాత‌కాల రీత్యా  ఈ రోజు ఉదయం 6:31 ని.. లకు పెళ్ళి చేయ‌టానికి ఇరు పెద్ద‌లు నిర్ణ‌యించారు. అయితే సోష‌ల్ డిస్టెన్స్ దృష్ట్యా క్లొజ్ స‌ర్కిల్ ని మాత్ర‌మే పిలిచి షామిర్ పెట్ లోని ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో పెళ్ళి జరిగింది.   ఈ పెళ్ళి లో ప్ర‌భుత్వం సూచించిన  అన్ని ప‌ద్ద‌తులు పాటించారు.   అభిమానుల మ‌ద్య‌లో ఈ పెళ్ళి ని ఆఢంబరంగా చేసుకొవాల‌నుకున్న నిఖిల్ ఇప్ప‌డు ఈ పరిస్థుతుల్లో కొవిడ్‌-19 వ్యాప్తి చెంద‌కూడ‌ద‌నే వుద్ధేశ్యం తో ఈ పెళ్ళి ఇలా నిరాఢంబ‌రంగా చేసుకున్నారు.   ఈ కార్య‌క్ర‌మానికి సంబంధించిన  ఫోటోస్‌, వీడియోస్ మాత్రం మీడియాకి,  ఫ్యాన్స్ కి,  మెయిల్  ద్వారా అందించ‌నున్నారు. ఈ నూత‌న‌వ‌ధువ‌రుల‌ను ఎక్క‌డి వారు అక్క‌డే వుండి మమ్మల్ని ఆశీర్వ‌దించాల‌ని కోరుకుంటున్నారు.  

Click here for Event Gallery

 


                    Advertise with us !!!