President Ram Nath Kovind extends greetings on National Technology Day

ప్రపంచాన్నే వణికిస్తున్న కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంతో శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణుల కృషి ఎనలేనిదని భారత రాష్ట్రపతి రామ్‍నాథ్‍ కోవింద్‍ ప్రశంసించారు. వైరస్‍ పోరులో వీరు ముందుండి పోరాడుతున్న తీరు దేశానికే గర్వకారణమని కొనియాడారు. అంతేకాకుండా దేశాభివృద్ధిలో శాస్త్ర, సాంకేతికత ఎంతో కీలకంగా మారిందని రాష్ట్రపతి అన్నారు. నేషనల్‍ టెక్నాలజీ డే సందర్భంగా భారత రాష్ట్రపతి పౌరులకు ట్విటర్‍లో శుభాకాంక్షలు తెలిపారు. రాజస్థాన్‍లోని పోఖ్రాన్‍లో 1998లో నిర్వహించిన అణుపరీక్షలకు గుర్తుగా ప్రతి సంవత్సరం మే 11ను నేషనల్‍ టెక్నాలజీ డే గా వ్యవహరిస్తున్నారు.