న్యూ జెర్సీ లో నాట్స్ ఆహార పంపిణీ

NATS Distributed Home Needs in New Jersey

నిరాశ్రయులకు సాయం అందించిన నాట్స్

అమెరికాలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ .. తాజాగా న్యూజెర్సీలోని న్యూ బ్రాన్స్‌విక్‌లో నిరాశ్రయులకు ఉచితంగా నిత్యావసరాలు, ఆహారం పంపిణీ చేసింది. కరోనా నియంత్రణకు లాక్‌డౌన్‌తో ఇక్కడ నిరాశ్రయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం నిత్యావసరాలు కూడా వారికి అందని పరిస్థితి ఉంది. ఈ తరుణంలో నాట్స్ సేవా భావంతో ముందుకొచ్చింది. వారిని ఆదుకునేందుకు  నాట్స్ న్యూజెర్సీ టీం నిత్యావసరాలు, వారికి అవసరమైన ఆహారాన్ని అందించింది.

న్యూజెర్సీ నాట్స్ నాయకులు రమేశ్ నూతలపాటి, రాజ్ అల్లాడ, వంశీ వెనిగళ్ల, చంద్రశేఖర్ కొణిదెల, సూర్య గుత్తికొండ, శేషగిరి కంభంమెట్టు, కుమార్ వెనిగళ్ల తదితరులు ఈ పంపిణీ కార్యక్రమంలో కీలక పాత్ర పోషించారు. నాట్స్ మాజీ అధ్యక్షడు, బోర్డ్ డైరెక్టర్ మోహన కృష్ణ మన్నవ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. మున్ముందు కూడా కరోనా ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న పేదలకు సాయం చేసేందుకు తన వంతు కృషి చేస్తుందని నాట్స్ డైరెక్టర్ మోహనకృష్ణ మన్నవ తెలిపారు. కష్టకాలంలో తమకు సాయం అందించినందుకు నిరాశ్రయులు నాట్స్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Click here for Event Gallery


                    Advertise with us !!!