Sai Pallavi Cinema Career Details

ఏ హీరోయిన్‌కైనా తన అందానికి అభినయం కూడా తోడైతే వారి కెరీర్‌కి ఢోకా ఉండదు. అయితే అందం లేకపోయినా అభినయంతో నెగ్గుకొచ్చిన హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. ‘భానుమతి.. సింగిల్‌ పీస్‌.. హైబ్రిడ్‌ ప్లి’ ఇదీ ‘ఫిదా’ సినిమాలో హీరోయిన్‌ సాయిప‌ల్ల‌వి  చెప్పిన డైలాగ్‌. ఆమె నిజ జీవితాన్ని ఊహించుకునే దర్శకుడు ఈ డైలాగ్‌ రాసినట్లున్నాడు. నిజానికి రెగ్యుల‌ర్‌ హీరోయిన్ల గ్లామర్‌తో పోలిస్తే సాయిప‌ల్ల‌వి కాస్త తక్కువ మార్కులే పడతాయి. అయితే ఆమె అభినయం అందాన్ని డామినేట్‌ చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఇండస్ట్రీకి వచ్చి తక్కువ సమయంలో స్టార్‌ హీరోయిన్‌ స్టేటస్‌ తెచ్చుకుంది సాయిప‌ల్ల‌వి. మే 9 ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా సాయిప‌ల్ల‌వి కెరీర్‌లోని కొన్ని ముఖ్యమైన విషయాల‌ను గుర్తు చేసుకుందాం. 

ప‌ల్ల‌వి కాస్తా సాయిప‌ల్ల‌వి అయింది
తమిళనాడులోని ఊటీకి చెందిన సెంతామరై, రాధామణి దంపతుల‌ కుమార్తె సాయిప‌ల్ల‌వి. ఆమె అసలు పేరు ప‌ల్ల‌వి. తల్లి సాయిబాబా భక్తురాలు కావడంతో సాయిప‌ల్ల‌వి అని మార్చారు. ఆమెకు పూజా అనే కవల‌ సోదరి కూడా ఉంది. సినిమాల్లోకి రావడానికి ముందు సాయిప‌ల్ల‌వి .. జార్జియాలో వైద్య విద్యను అభ్యసించింది.

తెలుగు ప్రేక్షకుల‌కు అప్పుడే పరిచయం
తల్లిదండ్రులు సాయిప‌ల్ల‌వికి డాన్స్‌ నేర్చించడంతో డాన్సర్‌గా మంచి పేరు తెచ్చుకుంది. ఈ క్రమంలోనే ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం అయిన ‘ఢీ’ అనే డ్యాన్స్‌ షోలో పాల్గొంది. అప్పుడే తనదైన శైలి నృత్యంతో తెలుగు ప్రేక్షకుల‌ను ఆకట్టుకుంది. ఆ సమయంలోనే ‘ధూం ధాం’ అనే తమిళ సినిమాతో పాటు ‘కస్తూరి మాన్‌’లో చిన్న చిన్న పాత్రలు చేసింది.

ఫిదా చేసింది.. ఫేమస్‌ అయిపోయింది
కేవలం ఒకే ఒక్క సినిమాతో భారీ స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకుందామె. చదువు పూర్తయిన వెంటనే ఆమె మయాళంలో వచ్చిన ‘ప్రేమమ్‌’లో నటించింది. ఆ సినిమాలో ఆకట్టుకోవడంతో.. తెలుగులో ‘ఫిదా’లో అవకాశం వచ్చింది. ఈ సినిమా వ‌ల్ల  సాయిప‌ల్ల‌వి ఫేమస్‌ అయిపోయింది.

కెరీర్ అంతా వివాదాల మ‌యం
సాయిప‌ల్ల‌వి కెరీర్‌ మాత్రం వివాదాల మయంగా సాగుతోంది. ఇప్పటికే ‘ఎంసీఏ’ సినిమా సమయంలో నానితో, ‘పడి పడి లేచే మనసు’ టైమ్‌లో శర్వానంద్‌, ‘కణం’ సినిమా అప్పుడు నాగ శౌర్యతో గొడమ ప‌డింద‌ని ప్రచారం జరిగింది. అయితే, ఆ తర్వాత వాటన్నింటినీ ఆమె ఖండించిన సంగతి విధితమే.

సాయిప‌ల్ల‌వి కెరీర్‌లో లిప్‌ లాక్‌ రచ్చ
అన్ని రకాల‌ రసాల‌ను అల‌వోకగా పండిరచగలిగే నటి కావడంతో సాయిప‌ల్ల‌వికి మంచి గుర్తింపు వచ్చింది. అదే సమయంలో ఆమె ముద్దు సీన్లు, గ్లామర్‌ షోకు దూరంగా ఉంటోంది. ఈ కారణంగానే విజయ్‌ దేవరకొండ నటించిన ‘డియర్‌ కామ్రేడ్‌’ ఆఫర్‌ను వదుకుంది. ఆ సినిమా రిలీజ్‌ టైంలో ఈ న్యూస్‌ బయటకు రావడంతో ఇది హాట్‌ టాపిక్‌ అయిపోయింది.

రౌడీ బేబీతో రికార్డులు బద్దలు కొట్టింది
సాయిప‌ల్ల‌వి నటించిన సినిమాల్లో చాలా వరకు సూపర్‌ హిట్‌ అయినవే ఉన్నాయి. అంతేకాదు, వాటిలో చాలా సినిమాలు  రికార్డుల‌ను క్రియేట్‌ చేశాయి. వాటిలో ధనుష్‌తో నటించిన ‘మారి 2’లో రౌడీ బేబీ అంటూ సాగే పాట ఎన్ని రికార్డుల‌ బద్దలు కొట్టిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ పాటను సాయిప‌ల్ల‌వి కోసమే చూసిన వారు ఎంతో మంది ఉన్నారు.

రెండు సినిమాలూ ఆగిపోయాయి
సాయిప‌ల్ల‌వి  ప్రస్తుతం నాగ చైతన్యతో కలిసి ‘ల‌వ్‌స్టోరీ’ అనే సినిమా చేస్తోంది. ఇది లాక్‌ డౌన్‌ కారణంగా వాయిదా ప‌డింది. ఇక, రానాతో కలిసి ‘విరాట పర్వం’ చేయాల్సి ఉంది. అనివార్య కారణా వ‌ల్ల ఈ మూవీ షూటింగ్‌ కూడా వాయిదా ప‌డింది. వీటితో పాటు మరికొన్ని చిత్రాల‌కు సంతకాలు చేసి చేతి నిండా సినిమాల‌తో బిజీగా సాగుతోన్న మన ‘భానుమతి’కి పుట్టినరోజు శుభాకాంక్షలు.