పాఠశాల వసంతోత్సవం మే 9న

TANA and BATA Presents Paatasala online Vasantostavam

అమెరికాలోని తెలుగు చిన్నారులకు ఆంధప్రదేశ్‍ ప్రభుత్వం సూచించిన సిలబస్‍తో తెలుగు భాషను నేర్పిస్తున్న ‘పాఠశాల’ వసంతోత్సవం మే 9వ తేదీన నిర్వహిస్తున్నారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), బే ఏరియా తెలుగు సంఘం (బాటా) ఆధ్వర్యంలో జరిగే ఈ పాఠశాల వసంతోత్సవాన్ని కోవిడ్‍ 19 సంక్షోభం కారణంగా ఆన్‍లైన్‍లో సాయంత్రం 4.00 నుంచి 6.00 వరకు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో భాగంగా ఫ్రీమాంట్‍, శాన్‍రామన్‍ పిల్లలు పలు సాంస్కృతిక  ప్రదర్శనలను ఇవ్వనున్నారు. తెలుగు పద్యాలు, కవితలు చెప్పడం, చిన్న కథలు చెప్పడం, నాటిక వేయడం వంటి కార్యక్రమాలతో చిన్నారులు అలరించనున్నారని పాఠశాల సిఇఓ సుబ్బారావు చెన్నూరి తెలిపారు.

బే ఏరియా పాఠశాల డైరెక్టర్‍ లు ప్రసాద్‍ మంగిన, రమేష్‍ కొండ, కరికులం డైరెక్టర్‍ డా. గీత, అడ్వయిజర్‍ వీరు ఉప్పల, విజయ ఆసూరి ఈ కార్యక్రమాలను పర్యవేక్షించనున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీచర్లు, చిన్నారులు కూడా పాల్గొంటున్నారు. ప్రీమాంట్‍ ఏరియా ప్రతినిధులు, టీచర్లు శ్రీదేవి పసుపులేటి (ఏరియా కో ఆర్డినేటర్‍), రామదాసు పులి (సెంటర్‍ కో ఆర్డినేటర్‍), పద్మ విశ్వనాథ, జశ్వంతి మండలి, సునీత రాయపనేని, దీపిక, శాన్‍రామన్‍కు చెందిన టీచర్లు కళ్యాణి చికోటి (ఏరియా కో ఆర్డినేటర్‍), శ్రీదేవి ఎర్నేని (సెంటర్‍ కో ఆర్డినేటర్‍), సత్య బుర్ర, అర్చన బురెడ్డి, మమత ఆవుల తదితరులు పాల్గొంటున్నారు.

ఈ కార్యక్రమానికి సంబంధించిన లింక్‍ ఫ్లయర్ లో చూడండి.

 


                    Advertise with us !!!