
బ్రిటన్ కేంద్రంగా పనిచేసే అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్‌ఫామ్ విన్వెస్టా లిమిటెడ్ భారతీయులు అమెరికా స్టాక్ మార్కెట్లో (యూఎస్ స్టాక్స్) ఇన్వెస్ట్ చేసుకునే అవకాశాన్ని తీసుకువచ్చింది. ఇందుకు గాను అమెరికాకు చెందిన డిజిటల్ ట్రేడింగ్ టెక్నాలజీ కంపెనీ డ్రైవ్ వెల్త్త్ ఒప్పందం చేసుకుంది. భారత్ వ్యాప్తంగా ఇన్వెస్టర్లు మొబైల్ యాప్ ద్వారా అమెరికా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్టు విన్వెస్టా ప్రకటించింది. భారతీయుల సంపదలో కేవలం 0.1 శాతమే సరిహద్దుల వెలుపల ఇన్వెస్ట్ చేసి ఉండడం ఆశ్చర్యం కలిగించేదిగా విన్వెస్టా వ్యవస్థాపకుడు, సీవో స్వస్తిక్ నిగమ్ తెలిపారు. కరోనా వైరస్ భారతీయుల పోర్ట్‌ఫోలియోపై ప్రభావం చూపించింది. అయితే, యూఎస్ మార్కెట్లు వేగంగా పుంజుకోవడంతో దేశీయ స్టాక్స్‌కే పరిమితం కావడం సమస్యాత్మకమని తెలియజేసింది. డ్రైవ్ వెల్త్‌తో చేతులు కలపడం భారత్‌లో నివసించే వారికి అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ అవకాశాలు కల్పించే దిశగా వేసిన ముఖ్యమైన మొదటి అడుగు అని స్వస్తక్ నిగమ్ తెలిపారు.