న్యూజెర్సిలో మెడికల్ సిబ్బందికి లంచ్ బాక్స్ లను పంపిణీ చేసిన తానా

TANA Distributed Lunch Boxes to Medical Staff In New Jersey

న్యూజెర్సిలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో మెడికల్‍ సిబ్బందికి లంచ్‍ బాక్స్ లను పంపిణీ చేశారు. కోవిడ్‍ 19 పేషంట్లకు వారు చేస్తున్న సేవలకు కృతఙతాపూర్వకంగా తానా ఈ లంచ్‍ బాక్స్లను అందించింది. రాబర్ట్ వుడ్‍ జాన్సన్‍ ఆసుపత్రిలో 100 లంచ్‍ బాక్స్లను అందించినట్లు తానా ప్రాంతీయ నాయకులు రాజా కసుకుర్తి తెలిపారు. పోలీసు సిబ్బందికి, ఫైర్‍ విభాగం సిబ్బందికి కూడా లంచ్‍ బాక్స్లను పంపిణీ చేశారు. తానా అధ్యక్షులు జయ్‍ తాళ్ళూరి, సతీష్‍ వేమన, లక్ష్మీదేవినేని, తదితరుల సహకారాంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు న్యూజెర్సి తానా నాయకులు పేర్కొన్నారు. సుధీర్‍ నారెపాలెపు, సౌమ్య చిర్ర తదితరులు కూడా ఈ కార్యక్రమం విజయవంతానికి సహకరించారు.

Click here for Event Gallery

 


                    Advertise with us !!!