అప్పాయింట్ మెంట్ ఉంటేనే షాపింగ్ చేయాలా?

Best Buy tests online shopping alternative appointment

కరోనా వైరస్‍ మహమ్మారితో వ్యాపార రంగంలో మార్పులు గణనీయంగా చోటు చేసుకున్నాయి. ఐటీ పరిశ్రమలో దాదాపు 70-90% మంది ఇంటి నుంచే పనిచేస్తున్నారు. సమావేశాలన్నీ వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా జరుగుతున్నాయి. భారత్‍లో సాంకేతికంగా ఇలాంటి మార్పులు రావాలంటే కనీసం 5-10 ఏళ్లు పడుతుందని అంతా భావించారు. కానీ కరోనా కారణంగా ఇప్పుడది   వారాల వ్యవధిలోనే వచ్చేసింది. లాక్‍డౌన్‍ కారణంగా నిత్యావసరాలు మినహా రిటైల్‍ దుకాణాలు మూతపడ్డాయి. ప్రభుత్వం ఇప్పుడిప్పుడే ఆరెంజ్‍, గ్రీన్‍ జోన్లలో పరిమిత అనుమతులు ఇస్తోంది. వ్యాపారాలు నిర్వహించుకొనేందుకు అవకాశం కల్పించింది. వైరస్‍కు ఇంకా మందు కనిపెట్టలేదు. అలాగని పూర్తిగా లాక్‍డౌన్‍  కొనసాగించలేని పరిస్థితి. భద్రతా మార్గదర్శకాలు ప్రకటించి మిగతా వ్యాపారాలను తెరిపించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో వినియోగదారుల భద్రత, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని రిటైల్‍ స్టోర్లు ‘అపాయింట్‍మెంట్‍’ వ్యవస్థను అమలు చేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. సామాజిక దూరం పాటించాలన్న నిబంధనల నేపథ్యంలో చాలా కంపెనీలు  ఆ దిశగా సమాలోచనలు చేస్తున్నాయి. ముందస్తు అపాయింట్‍మెంట్‍ తీసుకొనికొనుగోళ్లు చేపట్టే రోజులు బహుశా త్వరలోనే రానున్నాయి.

 


                    Advertise with us !!!