
అమెరికాలో కరోనా కారణంగా మృతిచెందే వారి సంఖ్య లక్ష లోపే ఉంటుందని, ఇది దిగ్భ్రాంతికర సంఖ్య అని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. మహమ్మారి కారణంగా దేశంలో లక్ష నుంచి 2.40 లక్షల మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదముందని మార్చి 29న శ్వేతసౌధం అంచనా వేసింది. అయితే లాక్డౌన్ ఆంక్షల నేపథ్యంలో ఇప్పటివరకూ మరణాలు అంతకు తక్కువగానే నమోదయ్యాయి. కాగా, నిత్యావసర దుకాణదారుల సమస్యలను పరిష్కరించినట్టు ట్రంప్ పేర్కొన్న క్రమంలో, మాంసం ప్యాకింగ్ పరిశ్రమలు తెరుచుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి. కానీ, వైరస్ల భయంతో చాలామంది ఈ పరిశ్రమల్లో పనిచేసేందుకు ఆసక్తి చూపించడం లేదు.