అమెరికాలో రోగులకు భారత్ మందులు

Hydroxychloroquine usage in US patients

అమెరికాలో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కోవిడ్‍ రోగులకు భారత్‍ పంపించిన యాంటీ మలేరియా ఔషధం హైడ్రాక్సీ క్లోరోక్విన్‍ (హెచ్‍సీక్యూ)ను ఇస్తున్నట్టుగా మెడికల్‍ పబ్లికేషన్‍ ఎండెడ్జ్ వెల్లడించింది. అమెరికాలో కరోనా హాట్‍స్పాట్‍లలో ఒకటైన కనెక్టికట్‍లో క్లోరోక్విన్‍  ఔషధాన్ని ఎక్కువగా వాడుతున్నారు. కరోనాపై పోరాటంలో క్లోరోక్విన్‍ గేమ్‍ ఛేంజర్‍గా మారుతుందని గతంలో అవెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍ వ్యాఖ్యానించారు. అమెరికాలో మరణాలు లక్షలోపు ఉండవచ్చునని ట్రంప్‍ అంచనా వేశారు.