బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ తో మరో పాన్ ఇండియా మూవీలో యన్.టి.ఆర్?

NTR and Sanjay Leela Bhansali s Pan Indian Film

యంగ్ టైగర్ యన్ టి ఆర్ టెంపర్ తో  మొదలు పెట్టిన జైత్రయాత్ర నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత వీర రాఘవ వరకు కొనసాగించింది. ఇకముందు RRR, త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రాలపై దృష్టిపెట్టారు. అతను నటించే మూవీ  అరవింద సమేత కి RRR, కి షుమారు రెండున్నర ఏళ్ళు గ్యాప్ వచ్చేలా వుంది. అంతే కాకుండా లాక్‌డౌన్ కూడా మరింత గ్యాప్‌ను పెంచడంతో అభిమానులు నిరాశలో వున్నారు  అయితే వారికి బంపర్ బొనాంజాను అందించేందుకు యంగ్ టైగర్ సిద్దమవుతున్నాడు.

ఇదిలా ఉంటే రోజురోజుకీ పాన్ ఇండియా హీరో గా మారిపోతున్నాడు ఎన్టీఆర్. ఎందుకంటే రాజమౌళి సినిమా అంటే అది పాన్  ఇండియా లెవెల్లో ఉంటుంది అన్న విషయం తెలిసిందే.  ఇక రాజమౌళి సినిమా విడుదల అయ్యింది అంటే ఇప్పటికే ఒక రేంజ్ లో ఉన్న ఎన్టీఆర్ క్రేజ్ మరెక్కడికో వెళ్ళిపోతుంది. ఇక రాజమౌళి సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తన క్రేజీ కాంబినేషన్ అయినా త్రివిక్రమ్ తో సినిమా సైన్ చేసిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ తన 30వ సినిమాగా చేయబోయే ఈ సినిమాను కూడా పాన్ ఇండియా లెవెల్లోనే ప్లాన్  చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో సూపర్ హిట్ సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబినేషన్లో రాబోయే  సినిమాకి ఇంకా క్లాప్ కూడా కొట్టలేదు.

ఈ క్రమంలోనే ఎన్టీఆర్ తన 31 వ సినిమాను కూడా సైన్  చేసినట్లు ప్రస్తుతం సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను కూడా పాన్ ఇండియా లెవెల్లోనే ప్లాన్ చేస్తున్నాడట ఎన్టీఆర్. ప్రస్తుతం ఎన్టీఆర్ 31వ సినిమా గురించి ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.. బాలీవుడ్ స్టార్ దర్శకుడైన సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో.. ఓ చారిత్రాత్మక చిత్రం తెరకెక్కనుందట.  ఇందులో హీరోగా ఎన్టీఆర్ నటించనున్నారు అనే టాక్ వినిపిస్తోంది. సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ  సినిమాలో ఎన్టీఆర్ ను ఢీకొట్టే విలన్ పాత్రలో బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ విలన్ గా నటించబోతున్నారు అనే టాక్ కూడా వినిపిస్తోంది. మరి ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్న ఈ వార్త ఎంతవరకు వాస్తవం అనేది మాత్రం అఫీషియల్ ప్రకటన వేచిచూడాలసిందే.


                    Advertise with us !!!