iaf-choppers-shower-flowers-gandhi-hospital-staff-1282596

కరోనా వైరస్‍ మహమ్మారిపై జరుగుతున్న పోరాటంలో కీలకమైన వేదికగా మారిన గాంధీ ఆస్పత్రిలో ఆదివారం (మే 3) రోజు అరుదైన ఘట్టం ఆవిష్క•తం కాబోతుంది. యావత్‍ ప్రపంచాన్ని కరోనా వైరస్‍ మహమ్మారి కబళిస్తున్న వేళ కరోనా ఫైటర్స్ గా మారి చికిత్స అందిస్తున్న గాంధీ వైద్యులపై పూల వర్షం కురవబోతుంది. గత కొద్ది రోజులుగా కరోనా వైరస్‍ బారిన పడిన రోగులకు సేవలు అందించేందుకు గాంధీ ఆసుపత్రి వైద్య సిబ్బంది చేస్తున్న కృషి అంతా ఇంతా కాదు. సెలవులను సైతం రద్దు చేసుకొని వైద్యం అందిస్తున్నారు. వీరి కృషి వల్ల ఎందరో బాధితులు కోలుకొని ఇంటికి తిరిగి వెళ్లారు. ఈ నేపథ్యంలో గాంధీ వైద్య సిబ్బందికి అభినందనలు తెలపడానికి ఎయిర్‍ ఫోర్స్ ముందుకు వచ్చింది. కరోనాని జయిస్తున్న వైద్యులు, ఇతర సిబ్బందికి సంఘీభావంగా రేపు ఉదయం 9:30 గంటలకు గాంధీ ఆస్పత్రిపై హెలికాప్టర్‍లతో పూల వర్షం కురిపించబోతున్నారు.