హెచ్ 1బీ వీసాదారులకు శుభవార్త

Good News for H1 B Visa Holders

అమెరికాలో గ్రీన్‍ కార్డు కోసం వేచి చూస్తున్న వారు, హెచ్‍ 1బీ వీసాదారులకు అక్కడి ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది. వివిధ కారణాల కింద నోటీసులు అందుకున్న గ్రీన్‍ కార్డు, హెచ్‍ 1బీ వీసాదారులు స్పందించేందుకు ఇచ్చిన గడువును 60 రోజుల పాటు పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు వారు మరో 60 రోజుల వరకు అవసరమైన పత్రాలు సమర్పించుకునే వెసులుబాటు కలుగుతుంది. నోటీసుల్లో పేర్కొన్న చివరి తేదీ తర్వాత 60 రోజుల వరకు వీరిపై ఎలాంటి చర్యలు ఉండవని సృష్టం చేసింది. కరోనా వైరస్‍ వ్యాప్తి నేపథ్యంలో అగ్రరాజ్యంలో ఇమిగ్రేషన్‍ కార్యాలయాలు మూతపడ్డ విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వానికి సమర్పించాల్సిన అనేక పత్రాలు, వీసాకు సం•ంధించిన ఇతర పక్రియలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఈ నేపథ్యంలో స్పందించిన అక్కడి ప్రభుత్వం 60 రోజుల అదనపు సమయాన్ని కల్పించింది.

 


                    Advertise with us !!!