swearing-ceremony-honorable-judges-high-court-andhra-pradesh

ఆంధప్రదేశ్‍ రాష్ట్ర హైకోర్టు నూతన న్యాయమూర్తులుగా నియమితులైన బొప్పూడి కృష్ణమోహన్‍, కంచిరెడ్డి సురేష్‍ రెడ్డి, కన్నెగంటి లలితకుమారి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‍ జితేంద్రకుమార్‍ మహేశ్వరి ఉదయం 11 గంటలకు వీరితో ప్రమాణం చేయించారు. కాగా ఈ ముగ్గురి నియామకంతో రాష్ట్ర హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 21కి చేరింది. ఈ కార్యక్రమంలో హైకోర్టు సీనియర్‍ అడ్వకేట్లు, జడ్జిలు, ప్రమాణ స్వీకారం చేసిన న్యాయమూర్తుల కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.