కొత్తగూడెంలో తానా మాస్క్ లు, నిత్యావసర వస్తువుల పంపిణీ

TANA Foundation Distributed Home Needs in Kothagudem

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా), తానా ఫౌండేషన్‍ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని భదాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం పట్టణంలో తాపీ పనిచేసే కూలీలు, ఆటో డ్రైవర్లు, ఇళ్లలో పనిచేసే వారికి నిత్యావసర వస్తువులను మిట్టపల్లి పాండురంగారావు, లగడపాటి రమేశ్‍ చంద్‍ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. దాదాపు 400 కుటుంబాలకు నిత్యావసర సరుకులను అందించారు. కరోనా వైరస్‍ వ్యాప్తి చెందకుండా ఉండడానికి ప్రతీ ఒక్కరూ మాస్కులు ధరించాలని మూడువేల మాస్కులు, అలాగే గ్రామీణప్రాంతాల్లోని పేద మహిళలు, వలస మహిళా కూలీలు ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలని వారికి మూడువేల ఋతురుమాళ్ళు కూడా అందించారు. 

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న మూడవ టౌన్‍ సిఐ ఆదినారాయణ మాట్లాడుతూ విదేశాల్లో స్థిరపడి తానా ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ కరోనా విపత్తు సమయంలో గత రెండు నెలల నుండి ఇంటిపట్టునే ఉంటూ  ఇబ్బందిపడుతున్న కూడా సొంతప్రాంతాన్ని మరిచిపోకుండా ఇక్కడి పేదలకు నిత్యావసర సరకులు ఇవ్వడం అభినందించదగ్గ విషయమని అన్నారు. తానా ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టిన తానా అధ్యక్షులు జయ్‍ తాళ్ళూరి, తానా ఫౌండేషన్‍ చైర్మన్‍ నిరంజన్‍ శృంగవరపు, తానా మహిళా కోఆర్డినేటర్‍ తూనుగుంట్ల. శిరీష, మిట్టపల్లి. సురేష్‍ కు అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్‍. కంబంపాటి. రంగారావు, కంబంపాటి. రమేశ్‍, మిట్టపల్లి. పాండురంగారావు,మిట్టపల్లి. మురళీ, కంబంపాటి. దుర్గాప్రసాద్‍, శ్రీనగర్‍ కాలనీ పంచాయతీ ఉపసర్పంచ్‍ లగడపాటి. రమేశ్‍ చంద్‍, కొల్ల. నర్సింహారావు, బొడ్ల. సత్యనారాయణ, బోగా. రవి పాల్గొన్నారు. ఈ సందర్బంగా కొత్తగూడెం స్థానికులు తానా బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.

Click here for Photogallery