Telangana sets itself audacious goals and achieves them

కరోనా సంక్షోభంలోనూ పారిశ్రామిక రంగంలో తెలంగాణకు దండిగా కొత్త అవకాశాలు వస్తాయని, రానున్న సంవత్సరాల్లో భారీ లక్ష్యాల సాధనకు కృషి చేస్తామని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‍ అన్నారు. భారతీయ ప్రజా వ్యవహారాల వేదిక (పబ్లిక్‍ ఎఫైర్స్ ఫోరం ఆఫ్‍ ఇండియా) సభ్యులతో కేటీఆర్‍ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. దేశంలోని కార్పొరేట్‍ సంస్థల ప్రతినిధులు, ప్రజావిధానాల నిపుణులు, ఇతర ప్రముఖులు సుమారు 70 మంది మంత్రితో సంభాషించారు. కేటీఆర్‍ పారిశ్రామిక, ఆర్థిక విధానాలు, కరోనా పరిస్థితులు ఇతర అంశాల గురించి మాట్లాడారు.               

 

తెలంగాణ ప్రభుత్వం గత ఆరేళ్లలో అద్భుత ప్రగతిని సాధించింది. కరోనా వల్ల పరుగు కొంత మందగించింది. దీనిని అధిగమిస్తాం. ఇప్పుడు భారత్‍ వైపు  ప్రపంచ దేశాలు అత్యంత సానుకూల దృక్పథంతో చూస్తున్నాయి. కరోనా కట్టడి ద్వారా భారత్‍ ప్రపంచానికి ఒక బలమైన సందేశం ఇచ్చింది. మున్ముందు ఫార్మా, ఎలక్టాన్రిక్స్, ఐటీ వంటి రంగాల్లో వేగంగా దూసుకుని వెళ్లవచ్చు. ఇందులో తెలంగాణ ముందంజలో ఉంటుంది అని కేటీఆర్‍ తెలిపారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను, ఆరోగ్య రంగంలో పెట్టుబడి అవకాశాలను మంత్రి వివరించారు. ఆయన్ను భారతీయ ప్రజావ్యవహారాల వేదిక ప్రతినిధులు అభినందించారు. తమ సంస్థలో గౌరవ సభ్యులుగా ఉండాలని కోరగా ఇందుకు కేటీఆర్‍ అంగీకరించారు.