అక్షయపాత్రకు లక్ష డాలర్ల విరాళం

one-lakh-dollars-donation-for-akshayapatra-foundation-during-the-lockdown

లాక్‍డౌన్‍లో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో రోజూ 2 లక్షల మందికి పైగా ఉచిత భోజనం అందిస్తున్న అక్షయపాత్ర ఫౌండేషన్‍కు అమెరికన్‍ టెక్నాలజీ సంస్థ జీ లిన్కస్  లక్ష డాలర్ల (సుమారు రూ.75.28 లక్షలు) విరాళం అందజేసింది. ఈ విరాళం ద్వారా 5.72 లక్షల మందికి భోజనాలను అందించొచ్చని అక్షయపాత్ర తెలంగాణ, ఏపీ అధ్యక్షుడు సత్యగౌర చంద్రదాస తెలిపారు. జీ లిన్కస్ సంస్థకు హైదరాబాద్‍లోనూ కేంద్రం ఉన్నది.

 


                    Advertise with us !!!