ఒకసారి కాదు చాలా సార్లు ప్రేమలో పడ్డాను

Lakshmi Rai Love Story

ఒకసారి కాదు చాలాసార్లు ప్రేమలో పడ్డాను అని అంటోంది నటి లక్ష్మీరాయ్‍. న్యూమరాలజీ ప్రకారం రాయ్‍ లక్ష్మీగా పేరు మార్చుకున్న ఈ అమ్మడు హీరోయిన్‍ వేశాల కోసం విశ్వప్రయత్నం చేస్తోంది. ఐటమ్‍ పాటలు మాత్రమే ఆమెను వరిస్తున్నాయి. దక్షిణాది అన్ని భాషల్లో నటించింది. ప్రస్తుతం బాలీవుడ్‍పై దృష్టి పెట్టింది. లక్ష్మీరాయ్‍ ప్రేమలో పడిందని అంటున్నారు. బాలీవుడ్‍కు చెందిన ఓ నిర్మాత కొడుకుతో లవ్‍ స్టోరీ నడుపుతోందని ప్రచారం జరుగుతోంది. దీనిపై సృష్టత ఇవ్వనప్పటికీ, గతంలో తను మూడు సార్లు ప్రేమలో పడినట్టు ఆసక్తికరమైన విషయం వెల్లడించింది. అయితే  మూడు సార్లు బ్రేకప్‍ అయిందని కూడా తేల్చి చెప్పింది. ప్రేమలో మోసపోయాను అని ట్విస్ట్ ఇచ్చింది. ప్రేమ, బ్రేకప్‍ ఈ రెండింటి వల్ల కుంగిపోయే వారికి లక్ష్మీరాయ్‍ లవ్‍ స్టోరీ ధైర్యాన్నిస్తుందని భావించవచ్చు.