
కాజల్ అగర్వాల్ ఒక్కొక్కటిగా పెద్ద సినిమా ఆఫర్లను అందుకుంటోంది. ఆమె చేతికి మరో భారీ చిత్రం కూడా వచ్చినట్టు తెలిసింది. విజయ్ త్వరలో మురుగుదాస్ దర్శకత్వంలో తుపాకి 2 మొదలు పెట్టనున్నారు. ఇందులో హీరోయిన్గా కాజల్ నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. తుపాకి లో కూడా హీరోయిన్ కాజల్. అందులో ఆమె పాత్రకు మంచి అప్లాజ్ వచ్చింది. అందుకే ఈసారి కూడ ఆమెనే రివీల్ చేయాలని దర్శకుడు భావిస్తున్నారని తెలిసింది. కాజల్ సైతం ఇటీవల ఇన్స్టాగ్రామ్ ద్వారా మాట్లాడుతూ విజయ్ తన ఫేవరేట్ కోస్టార అని హింట్ కూడా ఇచ్చింది. దీన్ని బట్టి ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయని, త్వరలోనే అధికారికంగా ప్రకటన రానుందని అంటున్నారు.