రామాయణ్ ప్రపంచ రికార్డు

Ramayan Ramanand Sagar Make World Record

రామానంద సాగర్‍ రచించి, దర్శకత్వం వహించిన రామాయణ్‍ ధారావాహిక విడుదలైన 33 ఏళ్ళ తరువాత సైతం, ఇప్పటికీ భారతీయ టెలివిజన్‍ ప్రపంచాన్ని ఏలుతుంది. రామాయణ్‍ సీరియల్‍ను దూరదర్శన్‍ పున ప్రసారం చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే రెండోసారి ప్రసారమౌతోన్న ధారావాహిక ప్రపంచంలోనే అత్యధికమంది వీక్షిస్తోన్న కార్యక్రమంగా రికార్డయినట్టు దూరదర్శన్‍ ఇండియా ట్విట్టర్‍లో షేర్‍ చేసింది. ఏప్రిల్‍ 16వ తేదీన రామాయణ్‍ను ప్రపంచవ్యాప్తంగా వీక్షించినవారి సంఖ్య అక్షరాలా 7.7 కోట్లు. దీంతో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది చూసే టీవీ ప్రసారాల రికార్డుని రామాయణ్‍ బద్దలు కొట్టినట్టయ్యింది. డీడీ నేషనల్‍ ఛానల్‍లో మార్చి నుంచి తిరిగి ప్రారంభించిన రామాయణ్‍ రోజుకి రెండు సార్లు ప్రసారం అవుతోంది.

 


                    Advertise with us !!!