హీరో రామ్ అరుదైన రికార్డు

Ram s iSmart Shankar Hits 100 Million On Youtube

హీరో రామ్‍ అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్నారు. యూట్యూబ్‍లో నాలుగు 100 మిలియన్‍ వ్యూస్‍ సాధించిన చిత్రాల హీరోగా రికార్డులకు ఎక్కాడు. దర్శకుడు పూరి జగన్నాథ్‍ కాంబినేషన్‍లో తెరకెక్కిన ఇస్మార్ట్శంకర్‍ హిందీ వెర్షన్‍ యూట్యూబ్‍లో 100 మిలియన్‍ వ్యూస్‍ సాధించి రికార్డులకు ఎక్కింది. ఆదిత్య మూవీస్‍ ఈ చిత్రం హిందీ ప్రదర్శన హక్కులను సొంతం చేసుకుంది. ఫిబ్రవరి 16న యూట్యూబ్‍లో విడుదల చేశారు. కాగా విడుదలైన 45 రోజుల్లో ఇస్మార్ట్శంకర్‍ హిందీ 100 మిలియన్‍ వ్యూన్‍కు చేరుకుంది. గతంలో రామ్‍ నటించిన ఉన్నది ఒకటి జిందగీ, హలో గురుప్రేమ కోసమే, నేను శైలజ హిందీ వెర్షన్లు యూట్యూబ్‍లో వంద మిలియన్‍ వ్యూస్‍ దక్కించుకున్నాయి. ఇస్మార్ట్శంకర్‍ సినిమాతో రామ్‍ ఆ ఫీట్‍ నాలుగోసారి సాధించారు. సౌతిండియా మొత్తంలో ఈ రికార్డు అందుకున్న ఏకైక హీరో రామ్‍. ఇక రామ్‍ ప్రస్తుతం కిషోర్‍ తిరుమల దర్శకత్వంలో రెడ్‍ మూవీ చేస్తున్నారు.