
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతుండటంతో మరో రెండు వారాల పాటు లాక్డౌన్ పొడిగిస్తున్నట్టు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. మే 4 నుంచి మే 17 వరకూ లాక్డౌన్ కొనసాగుతుందని కేంద్రహోంశాఖ ఉత్తర్వులు జారీ జారీచేసింది. అయితే లాక్డౌన్ సమయంలో గ్రీన్, ఆరెంజ్ జోన్లలో సాధారణ కార్యకలాపాలకు అనుమతించారు. జోన్ల పరిస్థితిపై ప్రతివారం అంచనా వేసి పరిస్ధితిని సమీక్షిస్తామని కేంద్ర హోంశాఖ పేర్కొంది.
కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు నానాటికీ దేశవ్యాప్తంగా పెరుగుతుండడంతో లాక్డౌన్ పొడిగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. లాక్డౌన్ మొదటి దశ మార్చి 22న ప్రారంభమై మార్చి 31న ముగిసింది. లాక్డౌన్ రెండో దశ ఏప్రిల్ 1న ప్రారంభమై మే3 వరకు కొనసాగనుంది. ఈ క్రమంలోనే కరోనా పరిస్థితి ఇంకా అదుపులోకి రాకపోవడంతో కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ మూడో దశ మే 4 నుంచి మే 17 వరకు ప్రకటించింది.
Click here Lockdown New Guilelines
Click here MHA Lockdown New Guilelines