ఏపీలో 1,463 కరోనా పాజిటివ్ కేసులు

Coronavirus Positive Cases in AP

ఆంధప్రదేశ్‍ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 7,902 మంది నమూనాలు పరీక్షించగా 60 పాజిటివ్‍ కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‍లో వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,463 చేరింది. కాగా ఇప్పటి వరకు 403 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. 33 మంది మరణించారు. ప్రస్తుతం 1027 మంది వివిధ కొవిడ్‍ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనాతో ఇవాళ నెల్లూరు జిల్లాలో ఒకరు, కర్నూలు జిల్లాల్లో ఒకరు మృతి చెందారు. ఈరోజు నమోదైన కేసుల్లో అత్యధికంగా 25 కర్నూలు జిల్లాలో ఉన్నాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 411కు చేరింది.

 


                    Advertise with us !!!