
కరోనా వ్యాధి తీవ్రత నేపథ్యంలో సరిహద్దు జిల్లాలలో నివసిస్తున్న పౌరులు ఆంధప్రదేశ్, మహారాష్ట్రల వైపు వెళ్లకుండా తెలంగాణ ప్రభుత్వం నిషేధం విధించింది. ఆ రెండు రాష్ట్రాలలో అధిక సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నందున ఈ చర్య తీసుకుంది. సరిహద్దులోని ప్రాంతాల ప్రజలు వైద్యం, అత్యవసర పనులకు కూడా ఏపీ, మహారాష్ట్రల్లోకి వెళ్లడానికి వీలు లేదని ప్రకటించింది. దానిని అమలు చేయడానికి పోలీసు బలగాలను పెంచింది. ఏపీలో కర్నూలులో కరోనా కేసలు ఎక్కువగా ఉండడం, అక్కడికి గద్వాల, మహబూబ్నగర్ జిల్లాల ప్రజలు వెళుతున్న నేపథ్యంలో రాకపోకలను నిషేధించింది. అలాగే ఖమ్మం, నల్గొండ జిల్లాల వారు విజయవాడ, గుంటూరు వైపు వెళ్లడానికి వీలు లేదు.