అధ్యక్ష ఎన్నికల విషయంలో ఏమవుతోంది?

United States presidential election 2020

అమెరికాలో ప్రతి 4 సంవత్సరాలు ఒకసారి అధ్యక్ష ఎన్నికలు జరుగుతుంటాయి. ఈ ఎన్నికకు సంబంధించిన పక్రియ దాదాపు సంవత్సరం పాటు జరుగుతుంది. కాని కరోనా వైరస్‍ కారణంగా ఇప్పుడు అమెరికాలో పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధ్యక్ష ఎన్నికల విషయంపై అందరూ ఆసక్తి చూపించడం సహజం. అధ్యక్ష ఎన్నికల విషయంలో ఏమవుతోందంటూ అందరూ ఎదురు చూస్తున్నారు.

అమెరికాలో ట్రంప్‍ పాలన 4 సంవత్సరాలు పూర్తి చేసుకొని 2020 నవంబర్‍ 3వ తేదీన జరగబోయే ఎన్నికలలో నూతన అధ్యక్షుడు ఎన్నిక అవుతారు అన్న సంగతి, ఈ ఎన్నికల ప్రణాళిక దాదాపుగా ఒక సంవత్సరం జరుగుతుందన్న సంగతి అందరికి తెలిసిందే.

 

2019 చివరివరకు ఇటు రిపబ్లికన్‍ పార్టీ లో ట్రంప్‍ కాకుండా వేరొకరు వచ్చే పరిస్థితిలో లేకపోవడం, అటు డెమోక్రట్స్ పార్టీలో కూడా ధీటైన నాయకులు లేకపోవడంతో, ఈసారి కూడా ట్రంప్‍ మళ్ళి అభివృద్ధిగా ఇంకొక టెర్న్ రావడం ఖాయం అని ఎక్కువ మంది అనుకున్నారు. కాని హఠాత్తుగా కరోనా సంక్షోభం రావడం దాంతో లక్షలాది మంది వైరస్‍ బారిన పడి ఆస్పత్రులపాలయ్యారు. వేలాదిమంది మరణించారు. మరోవైపు దేశం అంతా  లాక్‍డౌన్‍లోకి వెళ్ళిపోవడం, దాంతో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం వంటివి జరిగాయి. ఇది ట్రంప్‍ ఉహించని పరిణామాలు, ఈ కరోనా పరిస్థితుల కారణంగా అనేక రాష్ట్రాలలో అధ్యక్షుడి ఎన్నికల ప్రణాళిళకలో భాగంగా జరిగే ప్రైమరీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇది ట్రంప్‍కు నిజంగా బాధ, కోపం కలిగించే విషయాలే. వీటి గురించి క్లుప్తంగా పరిశీలిద్దాం.

ప్రైమరి ఎన్నికలను వాయిదా వేసిన రాష్ట్రాలలో డెమోక్రాపార్టీ అధీనంలో ఉన్న రాష్ట్రాలు, రిపబ్లికన్‍ పార్టీ అధీనంలో ఉన్న రాష్ట్రాలు ఉండడం ట్రంప్‍ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. డెమోక్రాపార్టీ గవర్నర్లు నడుపుతున్న కాలిఫోర్నియా, న్యూయార్క్, న్యూజెర్సీ, లూజియానా, విస్కానోసిన్‍, పెన్సిల్వేనియా, ఇండియానా, రోడ్‍ఐలాండ్‍ రాష్ట్రాలే కాకుండా, రిపబ్లికన్‍ పార్టీ గవర్నర్లుగా ఉన్న ఒహయో, టెక్సాస్‍, డెలావేర్‍, మేరిలాండ్‍, కనెక్టికట్‍ రాష్ట్రాలలో కూడా తప్పని పరిస్థితులలో ప్రైమరి ఎన్నికలను ఒకటి రెండు సార్లు తేదీలు మారుస్తూ వాయిదా వేస్తున్నారు. కొన్ని రాష్ట్రాలలో వాయిదా తేదీ ప్రకటించ కుండా వాయిదా వేస్తూ తీర్మానాలు చేశారు.  ఈ నేపథ్యంలో అసలు అధ్యక్ష  ఎన్నికలు సజావుగా జరుగుతాయా? లేదా? అన్నసందేహం చాలామందిలో కలిగింది. కాగా ఈ ఎన్నికల్లో ట్రంప్‍ ప్రత్యర్థిగా జో బిడెన్‍ డెమోక్రటిక్‍ పార్టీ తరపున పోటీ చేస్తున్నారు. తొలుత డెమోక్రాట్‍ పార్టీలో బెన్ని సాండర్స్ అధ్యక్ష పదవికి పోటీ చేయలేనని ప్రకటించి పోటినుంచి తప్పుకోవడంతో ఆ పార్టీ నుంచి ఇది వరకు వైస్‍ ప్రెసిడెంట్‍గా పనిచేసిన జో బిడెన్‍ అధికారికంగా డెమోక్రట్‍ పార్టీ నుంచి అధ్యక్ష పదవికి అభ్యర్థిగా ఎన్నికయ్యారు.