
కరోనా మహమ్మారి నేపథ్యంలో అమెరికాలో ఉన్న తెలుగు సంఘాలన్ని తమ కార్యక్రమాలను ఆన్లైన్లోనే చేసుకుంటున్నాయి. బే ఏరియా తెలుగు అసోసియేషన్ (బాటా), ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సహకారంతో ఆన్లైన్ ద్వారా సంగీత కార్యక్రమాన్ని ఏప్రిల్ 25వ తేదీన నిర్వహించింది. పాడనా తెలుగు పాట పేరుతో ఆన్లైన్లో నిర్వహించిన ఈ కరవోకె కార్యక్రమంలో ఎంతోమంది పాలుపంచుకున్నారు. వివిధ రకాల పాటలను పాడి వినిపించారు. ప్రముఖ గాయకులు ఘంటసాల, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల, కె.ఎస్. చిత్ర, ఎస్. జానకి పాడిన పాటలను పలువురు ఆలపించారు.
బాటా నాయకులు ప్రసాద్ మంగిన, విజయ ఆసూరి, వీరు ఉప్పలతో పాటు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొండల్రావు కొమరగిరి, రవి గూడపాటి, కామేష్మల్ల, శ్రియ చీమలమర్రి, ప్రేమ్, రజనీకాంత్ కాకర్ల, సంజన, శ్రీని, సుమంత్ పుసులూరి, ప్రసాద్ బోగవరపు పలువురు పాల్గొని తమకు ఇష్టమైన పాటలను పాడారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారందరికీ బాటా నాయకులు ధన్యవాదాలు తెలిపారు.