'ది దేవరకొండ ఫౌండేషన్' ద్వారా సహాయం అందించనున్న విజయ్ దేవరకొండ

ఈ కరోనా వైరస్ క్రైసిస్ లో ఇప్పటి వరకు ఎంతో మంది హీరోలు తమ తం విరాళాలు ప్రకటించారు అయితే ఇప్పటి వరకు ఇంకా  హీరో విజయ్ దేవరకొండ  ప్రకటించలేదని అభిమానులు ఎదురుచూసారు ఈ రోజు (26.04.2020) ఉదయం వీడియో ద్వారా తన ది దేవరకొండ ఫౌండేషన్ చేస్తున్న కార్యక్రమాలు వివరించారు ఆ వీడియో సారాంశం ఇది. 

"మై లవ్స్..ఐ మిస్ యు అల్ నేను మీ అందరి గురించి ఆలోచిస్తుంటా మీరందరు సేఫ్ గా ఉంటారని ఈ పరిస్థితి గురించి పేరు కూడా తలుచుకోవాలని లేదు. కానీ మనందరినీ గట్టిగా కొట్టింది నన్ను గూడ నేను అస్సలు మెంటాలిగా ఫైనాన్సియల్లి ప్రెపేర్డ్ లేను చూస్తే అకౌంట్ లో సరిపడా డబ్బు కూడా లేదు మా ఫామిలీ తో పాటు 35  మంది జీతాలు ఇవ్వాల్సిన బాధ్యత నా మీద వుంది డబ్బులు లేకపోవడం అన్నది కొత్తేమి కాదు  నాకు అలవాటే కానీ ఇలా 35 మంది శాలరీలు ఉండటం ఎందుకంటే నా సొంత ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయడం, ఫౌండేషన్ పెట్టడం నా సొంత స్టాఫ్ కూడా పెరగడం ఇదంతా 2 సంవత్సరాలు నుండి అనుకోండి. సరే అయిదేదో అయ్యింది కానీ లాస్ట్ మంథ్ ఈ డబ్బులు ఆరెంజిమెంట్ తో సరిపోయింది. ఇప్పుడు మీకు నాకు తెలుసు ఇంట్లోనుండి బయటకు వెళితే ప్రపంచవ్యాప్తంగా ఎంత డేంజర్ గా ఉందొ ఈ విషయం లో నేను ఏమైనా చేయాలి అని ఈ రోజు కెమెరా ముందుకు వచ్చాను. ముఖ్యంగా ఈ క్రైసిస్ వాళ్ళ రకరకాలుగా ఇష్యూస్ అవుతున్నాయి. అందులో రెండు సమస్యల గురించి ఆలోచించాను. మొదటిది అత్యవసర వస్తువుల అవసరాలు, రెండవది భవిష్యత్తు అవసరాలు ఫస్ట్  ఫ్యూచర్ రిక్విఎర్మెంట్ ఎంప్లాయిమెంట్  మన యూత్ ని క్యాపబుల్ గా ఉండడానికి వాలటరీగా నిరుద్యోగం విషయం లో  ఏం చేయడం. 

ఈ క్రైసిస్ తరువాత నిపుణులు పలు విధాలుగా చెపుతున్నారు. వున్నా ఉద్యోగాలు తగ్గుతాయని కొత్త ఉద్యోగాలు ఉండవని,... ఇది చాలా బాధాకరం. అయితే ఈ విషయంలో జులై 2019 లో నేను ఆలోచించిన రహస్య ప్రాజెక్టు  స్టార్ట్ చేశాను. అది  నా జీవితం లో ఒక లక్ష మందికి ఉపాధి కల్పించడం అన్నది నా డ్రీం. ఆగష్టు 2019 నుండి పాస్నెట్ టీం రెడీ చేశాను. ఆ పాస్నెట్ టీం ఫస్ట్ గోల్ ఏంటంటే ఒక 50 మంది యువకులకు ట్రైనింగ్ ఇచ్చి ఎంప్లాయిమెంట్ ఇవ్వడం, దానిలో భాగంగా  సెప్టెంబర్ 2019 లో వివిధ రంగాలకు చెందిన 650 మంది యువతీ యువకులు  శిక్షణ కొరకు దరఖాస్తులు పెట్టుకోవడం జరిగింది ఇందులో 120 మంది స్క్రూట్నిస్ చేసాము. ఈ 150మంది ని నా సొంత ఖర్చులతో  హైదరాబాద్ పిలిపించి వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి ఎగ్జామ్స్ పెట్టి మా ఫస్ట్ బ్యాచ్ 50 మంది సెలెక్ట్ చేసాము. డిసెంబర్ 2019 లో ఇక్కడే ఆ 50 మందికి  వసతి ఏర్పాటు చేసాము. వారి వారి రంగాలకు సంభందించిన  ట్రైనింగ్  ఇప్పించాను వాళ్ళ స్కిల్స్ ని బట్టి ఉద్యోగాలు వస్తాయి ఈ 50 మంది లో ఆల్రెడీ ఇద్దరికీ ఆఫర్ లెటర్స్ కూడా వచ్చాయి ఇంకా 48 మంది వున్నారు ఈ క్రైసిస్ అయిపోయిన తరువాత వాళ్లకు కూడా  అవకాశాలు వస్తాయని నమ్ముతున్నా.  లాస్ట్ ఇయర్ లోనే  ఇంత ప్రోగ్రెస్ సాధించాము  ఈ విషయం నేను రహస్యంగా ఉంచాలని అనుకున్నాను కానీ ఈ పరిస్థితిలో చెప్పడం తప్పలేదు. మరో ముఖ్యమైన విషయం సంతోషంగా గర్వంగా 'ది దేవరకొండ ఫౌండేషన్'  కార్యక్రమాలు కూడా నిర్విరామమగా  జరుపుతున్నాం. ఈ క్రైసిస్ తొలగిపోయిన తరువాత మా యూత్ రెడీ గా వుంది ఎంప్లాయిమెంట్ ఇప్పించడానికి .  ఈ యూత్ ఎంప్లాయిమెంట్ ప్రోగ్రాంకి ఒక కోటి రూపాయలు కమిట్ చేస్తున్నాను. అదనంగా ఇది కాకుండా నా రౌడీ వేర్, కింగ్ అఫ్ ది హిల్ ప్రొడక్షన్ నుండి రకరకాల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. ఇక అత్యవసర అవసరాల విషయం లో ఆ బాధ ఏమిటో నేను స్వయంగా అనుభవించిన వాడిని. ఎందుకంటె నేను పెళ్లి చూపులు సినిమా చేయక ముందు  విషయం, మాది  ఒక దిగువ మధ్య తరగతి కి చెందిన కుటుంభం ఆర్ధికంగా చాలా బాధలుపడ్డాం ఇంటి అద్దె కూడా ప్రతినెలా 15 వతేది తరువాతే కట్టేవాళ్ళము ఎన్నో ఇబ్బందులున్నా  మాకు తెల్ల రేషన్ కార్డు లేదు. అది అలా ఉంటే ప్రస్తుతం మన కె సి ఆర్ గారు ఈ విపత్కర పరిస్థితులలో పేద ప్రజలను ఇంటి పెద్దగా ఆదుకున్నాడు బియ్యం ఇచ్చి  అకౌంట్ లో డబ్బులు వేసి నిత్యావసర వస్తువులు ఇచ్చి ఆదుకున్నాడు నిజమ్ గా ఆయన చేసిన సహాయం ప్రజలు మర్చిపోరు.  అలాగే చిరంజీవి గారి ఆధ్వర్యం లో సినిమా పరిశ్రమకు చెందిన రోజువారీ వేతనం వాళ్ళకి చేసిన సహాయం కూడా ఎంతో గొప్పది. అయితే పేదవాళ్ళే కాకుండా మధ్య తరగతి జనం ఎన్ని బాధలున్న పైకి చెప్పుకోరు వేరేవారిని ఆశించారు అలంటి మధ్య తరగతి కి చెందిన వారికి మిడిల్ క్లాస్ ఫండ్ అని ఒక 25 లక్షలు కమిట్ చేస్తున్నాను. ఈ ఫండ్ కేవలం మిడిల్ క్లాస్ పీపుల్స్ కి ఇవ్వడం జరుగుతుంది అంటే గతం లో మా ఫామిలీ లాంటి ఫామిలీస్ అన్న మాట. దీనికి మీరు చెయ్యాల్సింది మా వెబ్ సైట్ www.thedevarakondafoundation.org ఓపెన్ చేసి మీకు అవసరమైన సరుకులను అందులో నింపి మాకు పోస్ట్ చేస్తే మా వాళ్ళు మీ సమీపం లో వున్నా సూపర్ మార్కెట్ నుండి మీకు సరుకులు ఇప్పించి మా వాళ్ళు డబ్బు పే చేస్తారు. ఇదంతా నేను చేసిన సినిమాల ద్వారా సంపాదించినవి అయితే ఈ క్రైసిస్ తో నా సినిమాలు ఆగిపోయాయి మల్లి ఎప్పుడు స్టార్ట్ అవుతాయో తెలియదు. అందుకనే నాకు అవసరం ఉందని చెపితే  ఈ లోగా నా మిత్రులు లోన్ గా ఇచ్చారు. 

నా మూవీస్ స్టార్ట్ కాగానే తిరిగి ఇచ్చేస్తాను. ప్రస్తుతం 2000 మంది కి ఈ 25లక్షలు ఖర్చు చేస్తాను ఇది మీ స్నేహితుడిగా చేస్తున్న సహాయం అనుకోండి. మీ మనస్సాక్షిగా సరుకులు అవసరం ఉంటేనే తీసుకోండి. మీరు అన్ని విధాలా  హ్యాపీ గా ఉండి ఉంటే తీసుకోకండి ఎందుకంటె నిజం గా  అవసరం ఉన్నవాళ్ళ కు అందాలనే అభిప్రాయం నాది. ఇప్పుడు మీరు తీసుకున్న మీకు దేవుడు సంపద ఇస్తే తిరిగి ఫౌండషన్స్ ఇస్తే అది మరొకరికి ఉపయోగపడుతుందని నా అభిప్రాయం." నమస్కారం అంటూ ముగించారు విజయ్ దేవరకొండ.


                    Advertise with us !!!