కరోనాపై సినిమాస్టార్ల సందేహాలు...తీర్చిన డాక్టర్ గురవారెడ్డి

హైదరాబాద్‍లో డాక్టర్‍ గురవారెడ్డి అనే పేరు తెలియనివారు ఎవరూ ఉండరు. హైదరాబాద్‍లోనే కాదు అంతర్జాతీయంగా కూడా ఆయన పేరు మోసిన డాక్టర్‍. మోకాళ్ళ నొప్పులకు శస్త్రచికిత్స చేసే డాక్టర్‍గా ఆయన ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఆయన ఎంతోమంది పేషంట్లకు దైవసమానుడు. ఆయనే డాక్టరే కాదు...సెలబ్రిటీ కూడా. ఆయన రాసిన ‘గురవాయణం’ ఎంతో పాపులర్‍ అయింది. అది చదువుతుంటే సమయం తెలియదని, ఆయనలో హాస్యం ఎక్కువని కూడా అంటారు. స్వచ్ఛమైన తెలుగు మాట్లాడే డాక్టర్‍ కూడా ఆయన. తెలుగు పదాలపై ఆయనకు ఎంతో పట్టు ఉందని ఆయన మాటలు, రచనలు తెలియజేశాయి. ఆయన అసలు పేరు అన్నపరెడ్డి వెంకట గురవారెడ్డి. గుంటూరులో జన్మించిన ఆయన నేడు అంతర్జాతీయంగా పాపులర్‍ అయిన వ్యక్తి. సన్‍షైన్‍ ఆస్పత్రి అధినేతగా ఉన్న డాక్టర్‍ గురవారెడ్డి ప్రజలను ఎప్పటికప్పుడు ఓ డాక్టర్‍గా చైతన్యపరచడంలో ముందుంటారు. రోగికి కావాల్సింది మంచి మాటలు. అలాంటి మంచి మాటలు చెప్పడంలో ఆయనకు ఎవరూ సాటిరారు. తాజాగా కరోనా వైరస్‍ మీద ఆయన ఇస్తున్న ప్రసంగాలు, వీడియోలు ఎంతోమందిలో కరోనా వైరస్‍పై ఉన్న భయాన్ని పోగొట్టాయి. కరోనా వైరస్‍ రాకుండా చూడటానికి ఎలా ఉండాలో కూడా తన వీడియో ద్వారా, మాటల ద్వారా అందరికీ తెలియజేశారు. తాజాగా కరోనా వైరస్‍పై ఉన్న పలు సందేహాలను సెలబ్రిటీలు అడుగుతుంటే ఆయన చెప్పిన తీరు ఎంతోమందిని ఆకట్టుకుంది.

నేడు ఎక్కడ చూసినా కరోనా వైరస్‍ గురించే చర్చ. ఆ వైరస్‍ మనకి వస్తుందా? రాకుండా ఉండాలంటే ఏమి చేయాలి. అలాగే లాక్‍డౌన్‍ పిరియడ్‍లో ఏ విధంగా ఉండాలి. ఇంట్లోకి తీసుకువచ్చే పాలు, పండ్లు, కూరగాయల ద్వారా వైరస్‍ వస్తుందా లేదా అన్న విషయాలపై సినిమాతారలు అడిగిన పలు సందేహాలకు ఏవీ గురువారెడ్డి తనదైన రీతిలో సమాధానాలు చెప్పారు. డాక్టర్‍గా ఆయన పలు సందేహాలను తీర్చిన తీరు అందరినీ ఆకట్టుకుంది.

ఆ వీడియో నేడు ఎంతో పాపులర్‍ అయింది. ఆ వీడియోను ఎంతోమంది తిలకించారు. తెలుగు టైమ్స్ పాఠకులకోసం ఆ వీడియోను ఇక్కడ ఇస్తున్నాము.


                    Advertise with us !!!