Kerala gears up to fight other annual outbreaks amid Covid 19

కోవిడ్‍ 19 మహమ్మారి వికృత రూపానికి ఎంతో అభివృద్ధి చెందిన అగ్రరాజ్యం అమెరికాతోపాటు, ఇతర పాశ్చాత్య దేశాలు గడగడలాడుతున్న కేరళ చూపిన ప్రతిభ ఇతర దేశాల ప్రశంసలను కూడా అందుకున్నాయి. కోవిడ్‍ 19 వైరస్‍ను సమర్థవంతంగా ఎదుర్కోవడంతోపాటు తిప్పికొట్టిన రాష్ట్రంగా కేరళ నేడు నిలుస్తోంది. ప్రపంచానికే ఆదర్శనీయంగా మారింది.

లభారత్‍లోని ఏ ఇతర రాష్ట్రం లేదా ప్రపంచంలోని ఏ ఇతర దేశం కూడా కేరళ ఎదుర్కొన్న సమర్థ వంతంగా ఈ వైరస్‍ను ఎదుర్కోలేకపోయాయి. భారతదేశం దక్షిణకొననున్న చిన్న తీరప్రాతం రాష్ట్రం కేరళ. మూడున్నర కోట్ల జనాభా కలిగిన ఈ రాష్ట్రం అమెరికా, ఇటలీ, స్పెయిన్‍ ఆ మాటకొస్తే వైరస్‍ ఉద్బవించిన చైనా కంటే ముందుగానే ఈ వైరస్‍ను ఎదుర్కొనేందుకు సిద్దమైంది. ప్రపంచంలోనే కరోనా వైరస్‍ కట్టడికి తొలి ప్రయత్నాలు ఇక్కడే మొదలయ్యాయి. ఆ ఫలితాలు ఇప్పుడు కళ్ళముందు కనిపిస్తున్నాయి. ఇతర రాష్ట్రాలు, దేశాల్లో రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతూ, కోలుకుంటున్న వారి సంఖ్య నామమాత్రంగా ఉంటోంది. కాని కేరళలో మాత్రం చురుగ్గా ఉన్న కేసుల కంటే కోలుకుంటున్న కేసుల సంఖ్య ఎక్కువగా నమోదౌతోంది. ఇది ఒక్క కేరళకే సాధ్యమైంది. దీంతో ఇప్పుడు కేరళలో కోవిడ్‍ 19ను ఎదుర్కొనేందుకు చేపట్టిన చర్యలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ద•ష్టి పెట్టింది. అలాగే పలువురు వైద్య శాస్త్రవేత్తలు దీనిపై అధ్యయనాలు ప్రారంభించారు. భారత్‍లో కోవిడ్‍ 19 కేసు మొట్టమొదటిగా కేరళలోనే నమోదైంది. ఆ తర్వాత ఇక్కడ కేసుల సంఖ్య జోరుగానే పెరిగింది. ఈలోగా ప్రభుత్వం చేపట్టిన చర్యలు మంచి ఫలితాలను ఇవ్వడం మొదలెట్టాయి. ఇతర రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగుతున్న సమయంలోనే కేరళలో కేసుల స్థిరీకరణ జరిగింది.

వామపక్ష సంకీర్ణ పాలనలో బలమైన ఆరోగ్య వ్యవస్థ ఇక్కడ ఉంది. దేశంలోని ఇతర రాష్ట్రాలన్నింటితో పోలిస్తే కేరళలో వైద్యశాలలు, వైద్యుల సంఖ్య అధికం. ఇక్కడ వైద్యరంగానికి సంబంధించి కూడా అధికార పంపిణీ జరిగింది. స్థానిక ప్రభుత్వాలు, కమ్యూనిటీ కేంద్రాలు, పురపాలక సంఘాలు కూడా తమ తమ స్థాయిలో ప్రజావైద్య శాలల్ని నిర్వహిస్తున్నాయి. గత 50ఏళ్ళలో దేశంలోని ఇతర రాష్ట్రాలన్నింటికంటే కేరళ రాష్ట్రం వైద్యం, విద్యారంగాలకు అత్యధిక నిధులు వ్యయం చేస్తోంది. కేరళలో ప్రతి మూడు గ్రామాలకు కనీసం రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. దేశంలో సగటున 7.3కిలోమీటర్లకు ఓ ఆరోగ్య కేంద్రముంటే కేరళలో 3.95 కిలోమీటర్లకే ఓ ఆరోగ్య కేంద్రాన్ని నెలకొల్పారు. కేరళలో వైద్యవిద్యలో సీటు సాధించడం చాలా కఠినతరం. ఇందుకోసం నిర్వహించే ప్రవేశప రీక్ష చాలా కఠినంగా ఉంటుంది. అయితే కేరళ విద్యార్ధులకు వైద్యవిద్యపట్ల ఆసక్తి ఎక్కువ. దీంతో ఈరాష్ట్రానికి చెందిన వేలాదిమంది చైనాలో వైద్యవిద్యనభ్యసిస్తున్నారు. విద్యాభ్యాసం అనంతరం చైనాలో రెండేళ్ళపాటు వైద్యులుగా సేవలందించాలన్న నిబంధన వారికి కాస్త ఇబ్బందిగా ఉన్నప్పటికీ స్థానికంగా సీట్లు అందుబాటులో లేకపోవడంతో ఎక్కువ మంది మళయాళీలు చైనా వైద్యవిద్యను ఆశ్రయిస్తున్నారు. అలాగే ఈ రాష్ట్రం నుంచి విదేశాలకెళ్ళి ఉపాధి పొందుతున్న వారి సంఖ్య చాలా అధికం. దాదాపు ప్రతి కుటుంబం నుంచి ఓ వ్యక్తి విదేశాల్లో ఉంటారు. రాష్ట్ర వ్యాప్తంగా 80లక్షల మంది విదేశాల్లో ఉన్నట్లు ఓ అంచనా. వీరిలో 20లక్షల మందికిపైగా గల్ఫ్ దేశాల్లోనే పనులు నిర్వహిస్తున్నారు.

వైద్యరంగంలో ఇంతటి పటిష్టంగా ఉన్నందునే చైనా కంటే కూడా ముందే కేరళ అప్రమత్తమైంది. ఈ వైరస్‍ పుట్టిన ఊహాన్‍లోనే కొందరు మళయాళీలు వైద్యవిద్యనభ్యసిస్తున్నారు. అక్కడ వైరస్‍ ప్రభావం మొదలుకాగానే వారంతా తిరిగి స్వస్థలాలకొచ్చేశారు. ఇలా ముందుగా కేరళలో నమోదైన కోవిడ్‍ 19 బాధితులు ఊహాన్‍ నుంచి వచ్చిన వైద్యవిద్యార్ధులే. దీంతో ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. ఆ రాష్ట్ర ఆరోగ్యమంత్రి కెకె శైలజ తన బ•ందంతో బరిలో దిగారు. జనవరి 9నే కేరళలోని నాలుగు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో వైద్య పరీక్షల నిర్వహణను మొదలెట్టారు. రోగ లక్షణాలున్నవారందర్నీ క్వారంటైన్‍కు తరలించారు. వారి నమూనాల్ని 700మైళ్ళ దూరంలోని పూణెలోని నేషనల్‍ ఇనిస్టిట్యూట్‍ ఆఫ్‍ వైరాలజీకి పంపడం మొదలెట్టారు.

మిగిలిన రాష్ట్రాలన్నింటికంటే కోవిడ్‍ 19ను ఎదుర్కోవడానికి కేరళ ముందుగానే సంసిద్దమైంది. ఇందుకు ప్రధాన కారణం 2018లో ఈ రాష్ట్రం నిఫా వైరస్‍ బారిన పడింది. అది కూడా సార్స్ సంబంధిత వైరస్సే. ఆ వైరస్‍కు కూడా మందులేదు. దీన్ని అదుపు చేసేందుకు రాష్ట్రాన్ని నిర్భందించడమొకటే మార్గమని గుర్తించింది. సామాజిక దూరం పాటించడం ద్వారా నిఫా బారిన పడొద్దంటూ ప్రజలకు ఉద్బోదించింది. నిఫా వ్యాధిగ్రస్తులను వెనువెంటనే ఆసుపత్రులకు తరలించింది. వారితో సన్నిహితంగా మెలగిన ప్రతి ఒక్కర్ని క్వారంటైన్‍కు పంపింది. ఇందుకవసరమైన పడకల్ని సిద్దం చేసింది. నిఫాను ఎదుర్కొనే క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య వ్యవస్థను మరింత పటిష్టం చేసింది. రెండేళ్ళ క్రితమే ప్రభుత్వ అధీనంలో క్వారంటైన్‍ గదులు, ఐసోలేషన్‍ కేంద్రాల్ని సిద్దం చేసింది. ఆ ఏడాది నిఫాను సమర్ధవంతంగా కట్టడి చేయగలిగింది. అయితే 2019లో తిరిగి మరోసారి ఈ వ్యాధి రాష్ట్రంలో విరుచుకుపడింది. రెండోసారి కూడా దీన్ని కేరళ ప్రభుత్వం సమర్ధవంతంగా ఎదుర్కొంది. వాస్తవానికి గతేడాది డిసెంబర్‍ నుంచి ఈ ఏడాది జూన్‍ వరకు మరోసారి నిఫా ప్రబలే ప్రమాదాన్ని ప్రభుత్వం అంచనాలేసింది. అలాగే ఎబోలా వ్యాప్తిపై కూడా ద•ష్టిపెట్టింది. వీటితో పాటు ఇతర అంటు వ్యాధుల్ని ఈ ఏడాది ఎదుర్కొనేందుకు సమాయత్తమైంది. గత నాలుగేళ్ళుగా రాష్ట్రంలో కుటుంబ ఆరోగ్య కేంద్రాలన్నింటిలో ఇందుకు సంబంధించిన పరికరాలు, సామాగ్రిని సిద్దంగా ఉంచింది. అలాగే ప్రజారోగ్య విభాగ సిబ్బందికి ప్రతినెలా క్రమం తప్పకుండా శిక్షణా సమావేశాలు నిర్వహించింది.

ఈలోగా కోవిడ్‍ 19 రాష్ట్రంలోకి ప్రవేశించింది. సరంజామా సిద్దంగా ఉండడంతో మిగిలిన రాష్ట్రాలకంటే దీన్నెదుర్కోవడంలో కేరళ ముందుగా ప్రతిస్పందించగలిగింది. ఈ వైరస్‍ రాష్ట్రంలోకొచ్చిందిన గుర్తించిన వెంటనే నిఘా బ•ందాల్ని అప్రమత్తం చేశారు. మానసిక ఆరోగ్య సంరక్షకుల్ని సిద్దం చేశారు. రోగులకు కౌన్సిలింగ్‍ ఇచ్చేందుకు ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పారు. ప్రతి జిల్లాలో 15చొప్పున బ•ందాల్ని ఏర్పాటు చేశారు. కొన్ని రోజుల వ్యవధిలోనే సాధారణ ఆసుపత్రుల్ని కోవిడ్‍ ఆసుపత్రులుగా మార్చేశారు. పెరుగుతున్న సంఖ్యకనుగుణంగా పడకల్ని సిద్దం చేశారు. కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు, హోటళ్ళను స్వాధీనం చేసుకున్నారు. వాటిలోనూ రోగులకు వైద్య చికిత్సకు ఏర్పాట్లు చేశారు. అన్నింటికంటే ముందు ఆరోగ్య కార్యకర్తల పాటు ముందువరుస సైనికులందరికి వ్యక్తిగత రక్షణ పరికరాల్ని అందుబాటులోకి తెచ్చారు. దేశంలో కరోనా ప్రభావం ఇంకా మొదలుకాకముందే గల్ఫ్ నుంచి ప్రత్యేక విమానాల్లో వీటిని దిగుమతి చేసుకున్నారు. అమెరికాలోని వివిధ ఆసుపత్రుల్లో పని చేస్తున్న మళయాళీ నర్సుల సాయంతో చేతి తొడుగులు, ఎన్‍ 95 రకం నోటి ముసుగుల్ని తెప్పించారు. 2500కు పైగా వెంటిలేటర్లను సిద్దంచేశారు. మరో 5వేల వెంటిలేటర్లను అప్పటికప్పుడు ఆర్డరిచ్చారు. అయితే అవి రాష్ట్రానికి చేరగలిగే పరిస్థితుల్లేనందున రాష్ట్రంలోని ప్రైవేటు ఆసుపత్రులన్నింటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దీంతో ఇప్పుడు మొత్తం 5వేల వెంటిలేటర్లు ఆ రాష్ట్రంలో అందుబాటులోకొచ్చాయి. సమర్ధవంతంగా బ్రేక్‍ద చైన్‍ను కేరళ అమలు చేసింది.

కరోనా లక్షణాలున్న వారిని వెంటనే గుర్తించి..వారిని ఇతరుల దగ్గరనుంచి వేరుగా ఉంచడం మొదటి ప్రాధాన్యతగా గుర్తించింది. వీరు ఎక్కడెక్కడ తిరిగారు? ఎవరెవరితో కలిసి ఉన్నారు? ఈ కీలకమైన సమాచారాన్ని సేకరించగలిగింది. వీటిని గుర్తించడంలో అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో సక్సెస్‍ ఫుల్‍ అయ్యింది. మూడెంచల విధానాన్ని రూపొందించింది.

అనుమానితులను గుర్తించడం మొదటిది. వారితో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించడం రెండోది...వీరితో ఏ మాత్రం సంబంధం లేని వారిని గుర్తించడం మూడోది..వీరందరీ సమాచారాన్ని అత్యంత పకడ్బందీగా చేపట్టింది. ఇలా చేయడంతో వైరస్‍ మరింత వ్యాపించకుండా కట్టడి చేసింది.

అన్నింటికీ మించి కేరళలో అక్షరాస్యత 94శాతం ఉండడం కూడా పరిస్థితిని వేగంగా అదుపు చేసేందుకు సహకరించింది. పదిలోపు కేసులు నమోదైన సమయంలోనే కేరళ ఆరోగ్య మంత్రి ఆ రాష్ట్రంలోని మీడియా యజమానులతో ఓ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ధ•వీకరణ లేని అంశాల్ని ప్రచురించొద్దంటూ కోరారు. అప్పట్నుంచి ప్రతిరోజు సాయంత్రం ఆమె మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఏ రోజుకారోజు వివరాల్ని అందిస్తున్నారు. యధావిధిగానే సోషల్‍ మీడియాలో ప్రజల్ని భయపెట్టే సమాచారం ప్రచారమైంది. దీనిపై కేరళ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. 300మందికి పైగా ఇటువంటి వ్యక్తులపై క్రిమినల్‍ కేసులు నమోదు చేసింది. సోషల్‍ మీడియాలో వచ్చే అంశాన్ని విశ్వసించొద్దంటూ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. అక్షరాశ్యులు అధికంకావడంతో వారు కూడా ప్రభుత్వ విజ్ఞప్తిని మన్నించారు. దీంతో నెమ్మదిగా సోషల్‍ మీడియాలో అసత్య ప్రచారాలు ఆగిపోయాయి. ప్రజల్లో అనవసర భయాల కల్పన నిల్చిపోయింది. ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై విశ్వాసం పెరిగింది. ఇప్పుడీ అంశాన్ని ప్రపంచంలోని పలు దేశాల్తో పాటు భారత్‍లోని వివిధ రాష్ట్రాలు అధ్యయనం చేస్తున్నాయి. భవిష్యత్‍లో ప్రజారోగ్యంపై చూపాల్సిన శ్రద్దను కేరళను చూసి నేర్చుకుంటున్నాయి.

సమర్థవంతమైన చర్యలు, సరైన దిశగా ట్రీట్‍మెంట్‍ ఇస్తే కోవిడ్‍ 19 వైరస్‍ను ఎదుర్కోవచ్చని కేరళ వైద్యులు ప్రపంచానికి తెలియజేశారు.