వివిధ దేశాల్లో కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో తెలుగు ఎన్నారైలతో మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కరోనా అంశంపై, లాక్డౌన్ తరువాత ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందన్న విషయాలపై వారితో చర్చించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో 1000 మంది ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు. అమెరికా, సింగపూర్, మలేషియా, దుబాయ్, లండన్, కెనడా నుంచి పాల్గొన్నారు. కరోనా వ్యాప్తి నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలు, ఆయా దేశాల్లో తెలుగువారి యోగక్షేమాలను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. విదేశాల్లో ఉన్న తెలుగువారందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఏపీలోని పరిస్థితిని కూడా చంద్రబాబు వారికి వివరించారు. ఎపిఎన్ఆర్టీ మాజీ అధ్యక్షులు రవి వేమూరి, ఎన్నారై టీడిపి నాయకుడు జయరామ్ కోమటి తదితరులు తొలుత జయరామ్ కోమటికి స్వాగతం పలికి మాట్లాడారు.
పూర్తి మీటింగ్ వివరాలు ఇక్కడ ఇస్తున్నాం.