2022 వరకు భౌతిక దూరం పాటించాల్సిందే

Social distancing in the US may have to be endured until 2022

కరోనా వైరస్‍ ప్రభావం మరో రెండేళ్ల వరకు ఉంటుందని, 2022 వరకూ భౌతిక దూరం పాటించాల్సిందేనని శాస్త్రవేత్తలు సూచించారు. లాక్‍డౌన్‍ ఒక్కసారి అమలు చేస్తే వైరస్‍ అదుపులోకి రాదని, ఆంక్షలు పాటించకుంటే అది మరోసారి మరింత భయంకరంగా విజృంభిస్తుందని హెచ్చరించారు. వేసవి కాలంలో కొవిడ్‍-19 వ్యాప్తి తగ్గుతుందన్న అంచనాలు నిజం కావన్నారు. టీకా లేదా సమర్థవంతమైన చికిత్స అందుబాటులోకి రాకుంటే 2025 నాటికి వైరస్‍ పునరుజ్జీవం చెందుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. వైరస్‍ సోకిన, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వ్యక్తుల నుంచి ఇతరులకు కొవిడ్‍-19 సోకుతుందని హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్‍ మార్క్ లిప్‍సిట్జ్ పేర్కొన్నారు.