
కరోనా వైరస్ నియంత్రణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు మద్దతుగా సీఎం సహాయ నిధికి విరాళాలు వెల్లువెత్తాయి. మైహోమ్ గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వర్ రావు సీఎం సహాయ నిధికి రూ.3 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. ఆ సంస్థ డైరెక్టర్లు జూపల్లి రామేశ్వర్ రావు సీఎం సహాయ నిధికి రూ.3 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. ఆ సంస్థ డైరెక్టర్లు జూపల్లి రామారావు, జూపల్లి శ్యామ్లు ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను కలిసి ఈ మేరకు చెక్కును అందించారు. గంగవరం పోర్టు లిమిటెడ్ కూడా సీఎం సహాయ నిధికి రూ. కోటి విరాళాన్ని అందించింది. సంస్థ చైర్మన్ డీవీఎస్ రాజు కేసీఆర్కు చెక్కును అందించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ తరపున జియో సీఈవో కేసీ రెడ్డి, రిలయన్స్ ప్రతినిధి కమల్ పొట్టపల్లి రూ.5 కోట్లు విరాళం ఇచ్చారు. వాసవి రియల్ ఎస్టేట్స్ ప్రైవేటు లిమిటెడ్ సీఎం సహాయ నిధికి రూ.25 లక్షల విరాళం ఇచ్చింది.